2025 Rewind: 2025 టాలీవుడ్.. ఈ 10 మంది హీరోయిన్ల పరిస్థితి గమనించారా?

సినీ పరిశ్రమలో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమే.! ఇక్కడ సక్సెస్ ఉంటే ఒక లెక్క… సక్సెస్ లేకపోతే ఇంకో లెక్క అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సక్సెస్ లేదు అంటే మేకర్స్ సైడ్ చేసేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. హిట్ పడితే మాత్రం ఆకాశానికెత్తేస్తుంటారు. ఇదే ఇండస్ట్రీ ఫార్ములా. ఒకప్పుడు టాలీవుడ్‌ లో ఓ వెలుగు వెలిగిన చాలామంది హీరోయిన్లు ..ఈ 2025లో అవకాశాలు లేక కొంతమంది, హిట్లు లేక ఇంకొంత మంది డల్ అయిపోయారు. ఆ లిస్టులో ఉన్న హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

Tollywood Heroines With No Offers and Hits in 2025

1) అనుష్క:

ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగింది స్వీటీ అనుష్క. ఇప్పుడు ఆమె ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. చేసిన సినిమాలు కూడా పెద్దగా హడావిడి చేయకుండానే వెళ్లిపోతున్నాయి. ‘సైజ్ జీరో’ ఎఫెక్టో, పర్సనల్ కారణాలో తెలియదు కానీ.. ఏడాదికి కాదు కదా, రెండేళ్లకు ఒక సినిమా అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సోషల్ మీడియాలోనూ సైలెంట్ అవ్వడంతో ఆడియన్స్ స్వీటీని మర్చిపోతున్నారు.

2) సమంత:

సమంత గ్రాఫ్ కూడా దారుణంగా పడిపోయింది. హెల్త్ ఇష్యూస్, వరుస ఫ్లాపులతో సామ్ కెరీర్ డైలమాలో పడింది. ప్రొడ్యూసర్‌గా మారి ‘శుభం’ చేసింది. ఆ సినిమాలో చిన్న పాత్ర చేసినా అది వర్కవుట్ కాలేదు. కమర్షియల్ గా సేఫ్ అయినప్పటికీ అద్భుతాలు ఏమీ చేయలేదు. మరో రకంగా సమంత టాలీవుడ్ కి దూరంగా ఉంటూ.. తెలుగు ప్రేక్షకులను దూరం చేసుకుంటుంది.

3) తమన్నా:

టాలీవుడ్ టాప్ లీగ్‌లో ఉండాల్సిన మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోజులో పడి ఇక్కడ గ్లామర్ కోల్పోయింది. అక్కడ వెబ్ సిరీస్‌లు, బోల్డ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నా.. తెలుగులో మాత్రం కేవలం స్పెషల్ సాంగ్స్‌కే పరిమితమైంది. హీరోయిన్‌గా ఆమె శకం ఇక్కడ ముగిసినట్లే కనిపిస్తోంది.

4) కాజల్:

పెళ్లి తర్వాత హీరోయిన్లకు క్రేజ్ తగ్గుతుందనే మాటను కాజల్ విషయంలో నిజమైంది.ఈ  చందమామ ‘కన్నప్ప’లో మెరిసినా.. లీడ్ హీరోయిన్‌గా ఆఫర్లు మాత్రం నిల్. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా అందరితో నటించిన కాజల్‌ను మేకర్స్ పక్కనపెట్టేశారు.

5) రకుల్ ప్రీత్ సింగ్:

రకుల్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ కాజల్ కి ఈక్వల్ గానే ఉంది. బాలీవుడ్ కు ఎన్నో ఆశలతో వెళ్ళింది కానీ, అక్కడ క్లిక్ అవ్వలేదు.. ఇక్కడ ఆఫర్లు రాలేదు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ఫొటోషూట్స్‌తోనే నెట్టుకొస్తోంది.

6) పూజా హెగ్డే:

బుట్టబొమ్మ పూజా హెగ్డేకి టైమ్ అస్సలు బాలేదు. స్టార్ హీరోయిన్ స్టేటస్ నుంచి ఇప్పుడు వరుస డిజాస్టర్లతో సతమతమవుతోంది. దాదాపు అరడజను ఫ్లాపులతో ఐరన్ లెగ్ ముద్ర పడేలా ఉంది.’రెట్రో’ వంటి పెద్ద సినిమాలో నటించినా, ‘కూలీ’లో ‘మౌనిక’ అంటూ ఆడిపాడినా ఆమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. అయితే 2026 ఆరంభంలో ‘జన నాయగాన్’ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. చూడాలి మరి కొత్త ఏడాది అయినా ఆమెకు కలిసొస్తుందేమో.

7) మెహరీన్:  

‘హనీ ఈజ్ ది బెస్ట్’ అనిపించుకున్న మెహరీన్.. గ్లామర్ డోస్ పెంచినా ఆఫర్లు మాత్రం రావడం లేదు. ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నా.. వెండితెరపై మాత్రం ఆమె కనిపించడం లేదు.

8) శృతి హాసన్:

‘సలార్’ తర్వాత శ్రుతి హాసన్ తెలుగు సినిమాలో నటించింది లేదు. పెద్దగా యాక్టివ్‌గా లేదు. తమిళ్ ‘కూలీ’ డబ్ అయినా ఇక్కడ ఆడలేదు. మహేశ్ – రాజమౌళి మూవీ కోసం జరిగిన ‘వారణాసి’ ఈవెంట్‌లో పాట పాడి అలరించింది తప్ప.. నటిగా ఈ ఏడాది శ్రుతి ఖాతా ఖాళీనే.

9) రాశీ ఖన్నా:

రాశీ ఖన్నాకు కూడా ఈ ఏడాది కలిసిరాలేదు. ఎన్ని భాషల్లో తిరిగినా ఆమె ఇమేజ్ మారడం లేదు. ఇప్పుడు ఆమె ఆశలన్నీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైనే ఉన్నాయి. ఇది తేడా కొడితే రాశీ ప్యాకప్ చెప్పేయాల్సిందే.

10) నభా నటేశ్:

ఈమె కూడా 2025 లో కనిపించలేదు.’డార్లింగ్’ తర్వాత ఈమె అడ్రెస్ లేదు.

11) కృతి శెట్టి:  

బేబమ్మ కూడా ఈ ఏడాది కనిపించలేదు. ఈమె తెలుగులో ఏ సినిమాలో నటించలేదు. తమిళంలో చేసిన 2 సినిమాలు కూడా రిలీజ్ కి నోచుకోలేదు.
టార్గెట్ మిస్ అయిన అంజలి

12) అంజలి:

‘గేమ్ ఛేంజర్’పై బోలెడు ఆశలు పెట్టుకుంది. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. గతంలో చేసిన ‘మదగజరాజ’ తో హిట్టు అందుకున్నా… ఈమెకు హెల్ప్ అవ్వలేదు.

2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus