ఇటీవల విడుదలైన అమలా పాల్ ‘ఆడై’ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్లో అమలాపాల్ నగ్నంగా కనిపించడం పెద్ద సంచలనమే సృష్టించింది. టీజర్ చూసిన ప్రతీ ఒక్కరూ అమలాపాల్ బోల్డ్ నెస్ కు అందరూ ప్రశంసలు కురిపించారు. సినిమాకి హైప్ కూడా బాగా పెరిగింది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ‘ఆమె’ పేరుతో విడుదల చేస్తున్నారు. అయితే ఈ టీజర్లో అమల నగ్నంగా ఉన్న షాట్స్ తక్కువేనట. కానీ సినిమాలో ఇంకా ఇలాంటి షాట్స్ గట్టిగానే ఉన్నాయని కోలీవుడ్ మీడియా వర్గాలు సమాచారం.
అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు మాత్రం పెద్ద షాకిచ్చిందట. సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమాలో ఉన్న పలు నేక్డ్ షాట్స్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ‘అసభ్యంగా ఉన్నాయని వాటిని తొలగించడమో, డీఫోకస్ చేయడమో, వేరే వాటితో రీప్లేస్ చేయడమో చేయాలని’ చిత్ర యూనిట్ కు ఆదేశమిచ్చిందట. అంతేకాదు చివరికి ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ ను జారీ చేశారట. అయితే టీజర్లో ఉన్నంత బోల్డ్ కంటెంట్ సినిమాలో ఉండకపోవచ్చని దీనిని బట్టి స్పష్టమవుతుంది.