వెబ్ సిరీస్ లలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ద ఫ్యామిలీ మ్యాన్ మరొక సీజన్ తో రెడీ అయిన విషయం తెలిసిందే. అయితే సమంత పాత్ర కారణంగా ఆ వెబ్ కంటెంట్ ప్రేక్షకుల ముందుకు వస్తుందా రాదా అనేది అనుమానంగా మారింది. సెంటిమెంట్స్ కు ఎంతగానో కనెక్ట్ అయ్యే తమిళ ప్రజలు మనోభావాలు దెబ్బతింటే అంత ఈజీగా ఊరుకోరు. అవసరమైతే నాయకులనే దించేస్తారు. ఇక తమిళ ప్రజల కోసం పోరాడిన ప్రభాకరన్ టైగర్స్ యోధులను తప్పుగా చూపించే ప్రయత్నం చేసినట్లు అనిపించడంతో ద ఫ్యామిలీ మ్యాన్ 2పై ఆగ్రహ జ్వాలలు అలుముకుంటున్నాయి.
సమంత టైగర్స్ లోని ఒక సభ్యురాలిగా కనిపించి టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేయడం వంటి సన్నివేశాలున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. సిరీస్ ను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో తమిళ యువత ఒక రేంజ్ లో మండి పడగా దెబ్బకు అక్కడి తమిళ్ ప్రభుత్వం కూడా దిగొచ్చింది. ప్రజల మనోభావాలు దెబ్బ తినే ఏ విషయాన్ని కూడా మేము ఒప్పుకొము అంటూ ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సందర్భంగా ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2ను రిలీజ్ చేయనివ్వకూడదని కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ప్రభుత్వం లేఖ ద్వారా తెలియజేసింది.
దీంతో మేకర్స్ జూన్ 4న రావాల్సిన ఈ సీజన్ ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది. ఎవరిని హార్ట్ చేసే విధంగా ఈ సిరీస్ ను తెరకెక్కించలేదని ఇప్పటికే దర్శకులు రాజ్ అండ్ డీకే కూడా ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. మరి కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖపై ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.