నాగశౌర్య-రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం “ఛలో”. హిలేరియస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలవుతుండగా నిన్న సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేషన్ అందుకొంది. ఈ చిత్రం గురించి సెన్సార్ బోర్డ్ నుంచి ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. సో “ఛలో” సెన్సార్ రిపోర్ట్ ఏంటో ఓ లుక్కేద్దాం..!!
నాగశౌర్య క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుందట, అసలు కాలేజ్ ఎపిసోడ్స్ లో హీరోహీరోయిన్ల నడుమ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందట. అలాగే.. ఫస్టాఫ్ మొత్తం అసలు ఒక ఊరు రెండు రాష్ట్రాలుగా ఎలా విడిపోయింది అని వివరించే విధానానికి జనాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం ఖాయం అంటున్నారు. అలాగే సెకండాఫ్ లో సత్య, వెన్నెల కిషోర్ ల కామెడీ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయట. ఈమధ్యకాలంలో ఈరేంజ్ కామెడీ ఎంటర్ టైనర్ చూడలేదంటున్నారు సెన్సార్ సభ్యులు. సో, “ఛలో” సక్సెస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. శుక్రవారం సినిమాను ఆడియన్స్ చూసి ధృవీకరించడం ఒక్కటే మిగిలింది. గతవారం అనుష్క “భాగమతి”తో ఈ ఏడాది మొట్టమొదటి జెన్యూన్ హిట్ కొట్టగా.. ఇప్పుడు శౌర్య “ఛలో” చిత్రంతో ఈ ఏడాది మొదటి సూపర్ హిట్ అందుకోవడం ఖాయం.