‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి మొన్నటివరకు చర్చ వస్తే… అంతకుముందు రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో, మొన్నీమధ్య వచ్చిన 45 సెకన్ల గ్లింప్స్ గురించి మాట్లాడేవారు. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా ‘నాటు నాటు..’ అంటున్నారు. ఈ సినిమా నుండి వచ్చిన మొదటి సింగిల్‌కు వచ్చిన స్పందన అలాంటిది. ఇద్దరు అదిరిపోయే డ్యాన్సర్లు కలసి ఇరగ్గొట్టిన పర్‌ఫార్మెన్స్ ఆ పాట. ఈ పాటను ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రచించారు. ఈ పాట గురించి, పాటకు ఆయన చేసి శ్రమ గురించి ఇటీవల మాట్లాడారు.
‘‘తెర మీద ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలసి ఆడిపాడే పాట ఇది. ఇద్దరూ కలసి డ్యాన్స్ చేస్తే… ఎలా ఉంటుందో ఊహించి పాట రాయమని రాజమౌళి అడిగారు. పాటలో ఫలానా అంశమే ఉండాలని నిబంధన ఏదీ లేదని కూడా చెప్పారు. అయితే సినిమా కథ కాలానికి సంబంధించిన భాష, పదాలు ఉండాలన్నారు. దీంతో మూడు రోజుల్లో పాట రాసిచ్చాను’’ అని చెప్పారు చంద్రబోస్. పాట త్వరగానే పూర్తయిపోయినా, అందులో మార్పులకు మాత్రం ఇంకాస్త సమయం పట్టిందని చెప్పారు చంద్రబోస్.
పాటలో మార్పులు, చేర్పులు, కూర్పులు చేశాం. పాట ఎంతో సంతృప్తకరంగా వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఈ పాటను అందంగా ఆలపించిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌కు అభినందనలు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను అని ముగించారు చంద్రబోస్.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!