Akhil: ‘ఏజెంట్‌’ స్క్రిప్ట్‌ని రీచెక్‌ చేసుకుంటున్నారట నిజమేనా

‘అఖిల్‌’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని వారసుడు అఖిల్‌. హీరో మెటీరియల్‌ అయినప్పటికీ అఖిల్‌కు సరైన సినిమా పడక ఇప్పటివరకు రీ ఎంట్రీ, రీ రీ ఎంట్రీ, రీ రీ రీ ఎంట్రీలు ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రీ రీ రీ రీ ఎంట్రీ కోసం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’తో రాబోతున్నాడు. కరోనా పరిస్థితుల వల్ల ఈ సినిమా ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. వచ్చినా అనుకున్న ఎంట్రీ దొరుకుతుందా అంటే ‘ఏమో’ అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఒకవేళ బ్యాచిలర్‌ తేడా కొడితే… రీ రీ రీ రీ రీ ఎంట్రీ కోసం అభిమాను వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి. ఆ సినిమానే ‘ఏజెంట్‌’. దీంతో ఈ సినిమా విషయంలో అక్కినేని టీమ్‌ చాలా పకడ్బందీగా ప్లాన్‌ చేస్తోందట.

నిజానికి ‘ఏజెంట్‌’ సినిమా చిత్రీకరణ ఈ నెలలో నే మొదలవ్వాలి. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల సినిమా చిత్రీకరణలు ఆగిపోయాయి. దీంతో ‘ఏజెంట్‌’ మొదలవ్వడానికి ఇంకాస్త టైమ్‌ పడుతుంది. ఈలోగా సురేందర్‌ రెడ్డి టీమ్‌ సినిమా కథ మీద మళ్లీ కూర్చుందట. నాగార్జున ఇటీవల సూచించిన కొన్ని మార్పులను ఈ టీమ్‌ అమలులో పెట్టే పనిలో ఉందట. ఆ విధంగా సినిమా కథను పూర్తిగా సిద్ధం చేసుకొని… ‘ఏజెంట్‌’ను పట్టాలెక్కించాలని అనుకుంటున్నారట.

అఖిల్‌ గత సినిమాలు చూస్తే… అంతా బాగున్నా ఎక్కడో ఏదో కొట్టింది అన్నట్లుగా చిన్న లూప్‌ హోల్స్‌ ఉండేవి. సినిమా వచ్చాక వాటిని పట్టుకొని ‘ఇలా చేసుంటే’ బాగుండేది అనిపించేదట. దీంతో ఈసారి ‘ఏజెంట్‌’ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సినిమా లుక్‌ విషయలో అఖిల్‌ స్పెషల్‌ కేర్‌ తీసుకున్నాడు. లవర్‌ బాయ్‌ లుక్‌ నుండి రఫ్‌ లుక్‌లోకి వచ్చాడు. పోస్టర్లలో అది కనిపిస్తోంది. కర్లీ హెయిన్‌, టోన్డ్ బాడీతో వావ్‌ అనిపించాడు. ఆ ఫీల్‌ సినిమాలోనూ ఉంటే ఎంట్రీ వచ్చినట్లే.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus