షూటింగ్ స్టార్ట్ అవ్వకపోవడానికి అసలు కారణం..?

  • December 7, 2019 / 01:42 PM IST

ఈ ఏడాది ‘సాహో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ వారు నిర్మించారు. అయితే రెండేళ్ళుగా ఎదురుచూసిన అభిమానులని అలరించడంలో ఈ చిత్రం నిరాశపరించిందనే చెప్పాలి. అయితే కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు చూపించడంతో కొంత మేరకు అభిమానులు శాటిస్ఫై అయ్యరు. ఇక వారి దృష్టి మొత్తం ప్రభాస్ 20 వ చిత్రమైన ‘జాన్'(వర్కింగ్ టైటిల్) వైపు మళ్ళించుకున్నారు. ప్రభాస్ పుట్టినరోజుకి ఈ చిత్రం నుండీ అప్డేట్ వస్తుంది అనుకుంటే.. అలా ఏమీ జరగలేదు.

ఈమధ్య ఏకంగా ఇంటర్నేషనల్ లెవల్ లో ‘ఉయ్ వాంట్ ప్రభాస్ 20 అప్డేట్’ అనే ట్యాగ్ తో ట్రెండ్ చేశారు. అయినప్పటికీ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ కానీ నిర్మాతలు ‘యూవీ క్రియేషన్స్’ వారు కానీ.. ప్రభాస్ కానీ అస్సలు స్పందించలేదు. ‘సాహో’ రిలీజ్ కు ముందు కొంత భాగాన్ని షూట్ చేశారు. అయినప్పటికీ దాంతో వారు సంతృప్తి చెందలేదని తెలుస్తుంది. ‘సాహో’ విషయంలో జరిగిన తప్పు.. ‘జాన్’ కు జరగకూడదని స్క్రిప్ట్ లో తగిన మార్పులు చేసి.. షూటింగ్ లోకి దిగాలని వారు ఫిక్సయినట్టు సమాచారం.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus