DVV Danayya: దానయ్య భారీ ప్లాన్‌ వేస్తున్నారుగా మళ్లీ…

  • June 6, 2021 / 10:46 PM IST

టాలీవుడ్‌లో కొన్ని కాంబో సినిమాల చర్చ భలేగా ఉంటుంది. రీసెంట్‌గా ఇలాంటి కాంబోల్లో కామన్‌గా ఉంటున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ‘కేజీఎఫ్‌’తో మొత్తం ఇండియాను తనవైపు తిప్పుకున్న ప్రశాంత్‌ నీల్‌… ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌. అతనితో సినిమా చేయడానికి స్టార్‌ హీరోలు చాలామంది వెయిట్‌ చేస్తున్నారు. అందులో రామ్‌చరణ్‌ కూడా ఒకరు అని తెలుస్తోంది. ఈ క్రమంలో చరణ్‌ సినిమాపై ఆసక్తికర రూమర్‌ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రశాంత్‌ నీల్‌కు ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య చాలా రోజుల క్రితమే అడ్వాన్స్‌ ఇచ్చారని సమాచారం. ఇటీవల ప్రశాంత్‌ జన్మదినం సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే ’పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేసింది దానయ్య టీమ్‌. అయితే మరి ఆ ప్రొడక్షన్‌లో నటించేది ఎవరు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. అయితే ఆ సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తారని తెలుస్తోంది. ఇద్దరూ మెగా కుటుంబం నుండే. మెగా కాంపౌండ్‌ నుండి మల్టీస్టారర్‌ వస్తే చూడాలని చాలా రోజుల నుండి అభిమానులు ఆశిస్తున్నారు.

అందలో రామ్‌చరణ్‌ – సాయితేజ్‌కాంబో ఒకటి. ఇప్పుడు దానయ్య ఆ ఇద్దరు హీరోలను కలపి సినిమా తీస్తున్నారట. ప్రశాంత్ నీల్‌ డైరెక్ట్‌ చేయబోయే సినిమా అదేనట. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు అనేది తెలియదు కానీ… రూమర్‌ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇది నిజమని మరికొన్ని సూచనలు వస్తే… సినిమా ఎప్పుడు అనేది అప్పుడు ఆలోచిద్దాం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus