Charmme Kaur: పరిస్థితి విషమిస్తోందన్న ఛార్మీ.. ఏమైందంటే..?

Advertisement

పదుల సంఖ్యలో తెలుగు సినిమాల్లో నటించి నటిగా ఛార్మీ కౌర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా నటిగా సినిమాలకు దూరమైన ఛార్మీ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఛార్మీ నిర్మాతగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. అయితే తాజాగా ఛార్మీ ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఛార్మీ తాత్కాలికంగా సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పారు.

వేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ఛార్మీ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పడానికి కారణం కావడం గమనార్హం. ఛార్మీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఎమోషనల్ లేఖను పంచుకుని ఈ విషయాన్ని వెల్లడించారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాను కరోనా విలయతాండవాన్ని చూడలేకపోతున్నానని ఛార్మీ అన్నారు. భారీగా పెరుగుతున్న కేసుల వల్ల పరిస్థితి మరింత భయంకరంగా మారుతుందని ఆందోళన చెందుతున్నానని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం కరోనా వల్ల జరుగుతున్న పరిణామాలను చూసి తట్టుకునే శక్తి తనకు లేదని అందువల్ల తాను సోషల్ మీడియాకు దూరమవుతున్నానని ఛార్మీ చెప్పుకొచ్చారు.

ఇంట్లోనే ఉండి ప్రేమించిన వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఛార్మీ అన్నారు. కరోనా వల్ల పరిస్థితి విషమిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం లైగర్ సినిమా పనులతో ఛార్మీ బిజీగా ఉన్నారు. కరోనా విజృంభణ వల్ల లైగర్ షూటింగ్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు.


Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus