పూరీ “క్యాంప్ ఆఫీస్”లో చార్మీ!!!

అందాల భామ చార్మీ మళ్లీ పూరీ పక్కన చేరిపోయింది. మళ్లీ పూరితో కలసి నిర్మాణ భాద్యతలు చేపట్టనుంది. ఇంతకీ విషయం ఏమిటంటే, పూరీ దర్శకత్వంలో తాజాగా విడుదలయైన రెండు సినిమాలు జ్యోతి లక్ష్మి, లోఫర్. ఈ రెండు సినిమాలకు ప్రొడక్షన్ మ్యానేజ్మెంట్ మొత్తం అందాల భామ చార్మీనె చూసిందంటా. అయితే ఈ రెండు సినిమాల తరువాత పూరీ జగన్నాధ్ తన మొత్తం టీమ్ ను మార్చేసాడు. ఇక ఆ మార్పులో భాగంగానే చార్మీ సైతం పూరికి దూరం అయ్యింది అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా పూరీ రోగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత కల్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చెయ్యనున్నాడు. ఈ రెండు సినిమాలకు కూడా ప్రొడక్షన్ మ్యానేజ్మెంట్ చార్మీనే అని పూరీ ప్రకటించేసాడు.

దానికి కారణం ఆమె ప్రొడక్షన్ మ్యానేజ్మెంట్ లో చాలా దిట్ట అంట. మొన్నటి వరకూ హీరోయిన్‌గా, ఆ తరువాత నిన్నటి వరకూ ఐటమ్ గర్ల్ గా అలరించిన చార్మీ ఇప్పుడు నిర్మాణ భాద్యతలు సైతం తీసుకుని ముందుకు దూసుకు పోతుంది, అదే క్రమంలో ఆ భామ త్వరలోనే దర్శకురాలిగా మారి మంచి సినిమాలు తీస్తాను అంటుంది. ఏది ఏమైనా….ఈనాటి ఈ భందం ఏనాటిదో…మరి అంటూ గుస గుసలు ఇండస్ట్రీలో అక్కడక్కడా వినిపిస్తున్నాయి కూడా, దానిపై కూడా మన పూరీ-చార్మీ కాస్త ఆలోచన చేస్తే బావుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus