Chatrapathi Hindi Remake: ఫేక్ న్యూస్ లకి చెక్ పెట్టిన హిందీ ‘ఛత్రపతి’ టీం..!

16 ఏళ్ళ క్రితం రాజమౌళి.. ప్రభాస్ తో తెరకెక్కించిన ‘ఛ‌త్ర‌ప‌తి’ చిత్రాన్ని.. ఇప్పుడు దర్శకుడు వినాయక్… బాలీవుడ్లో రీమేక్ చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఈ చిత్రంలో హీరోగా నటించబోతున్నాడు.చాన్నాళ్ల పాటు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో.. ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది అంటూ ప్రచారం మొదలైంది. కానీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల ఈ చిత్రం షూటింగ్ మొదలుకాలేదని… అంతేకాక ముంబైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ‘ఛత్రపతి’ రీమేక్ కోసం వేసిన సెట్ కూడా పాడైపోయిందని..

దాని వల్ల నిర్మాతలకి రూ.3 కోట్లు నష్టమని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం గురించి ఇప్పుడు మరో ఫేక్ న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుండడం గమనార్హం. విషయంలోకి వెళితే.. ఈ చిత్రంలో హీరోయిన్ గా రెజీనా ఖరారైనట్టు ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో రెజీనాకి పెద్ద ఆఫర్లు లేవు కాబట్టి…ఆమెకు ఇది ప్లస్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ చిత్ర‌బృందం ఈ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పేసింది.

ఈ రీమేక్ లో హీరోయిన్ గా ఇంకా ఎవ్వరినీ ఫైనల్ చేయలేదని…బాలీవుడ్ హీరోయిన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు వారు చెప్పుకొచ్చారు. ఆ బాలీవుడ్ హీరోయిన్ కూడా స్టార్ హీరోయిన్ అయ్యి ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. 35 రోజుల పాటు నాన్ స్టాప్ గా కాల్షీట్లు ఇచ్చే స్టార్ హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు కూడా వారు చెప్పుకొచ్చారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus