Chatrapathi: పాపం కనీసం ప్రింట్ ఖర్చులు కూడా రాలేదు కదా!

స్టార్ హీరోల కెరీర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన చిత్రాలను 4K కి మార్చి , డాళ్బీ అట్మాస్ సౌండ్ ని మిక్స్ చేసి రీ రిలీజ్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కొత్త సినిమాల కంటే అభిమానులు ఎక్కువగా రీ రిలీజ్ చిత్రాలకే ఈమధ్య బ్రహ్మరథం పట్టడం మనం చాలా సార్లు చూసాము. ఈ రిలీజ్ మేనియా లో ఎక్కువ పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు కి ఆల్ టైం రికార్డ్స్ ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ రికార్డ్స్ ని మహేష్ కొట్టడం, మహేష్ రీ రిలీజ్ రికార్డ్స్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టడం. ఇది రొటీన్ అయిపోయింది, మధ్యలో ఎన్టీఆర్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ మరియు ప్రభాస్ వంటి వారి సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యాయి కానీ, ఈ ఇద్దరి హీరోల రికార్డ్స్ ని మాత్రం బ్రేక్ చేయలేకపోయారు. ఇప్పుడు రీసెంట్ గా ప్రభాస్ : మంచు విష్ణు ‘కన్నప్ప’ నుండి ప్రభాస్ అవుట్..

ఆ స్థానం లోకి మరో క్రేజీ హీరో! పుట్టినరోజు సందర్భంగా (Chatrapathi) ‘ఛత్రపతి’ సినిమాని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు. ఈ సినిమాకి రెస్పాన్స్ అదిరిపోతాది అని అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాకి కనీసం 30 లక్షల రూపాయిల గ్రాస్ కూడా రాలేదు. 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్ళలో టాక్సులు, థియేటర్ రెంట్స్ మరియు ఇతర ఖర్చులు పోను కనీసం 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు కూడా వచ్చే అవకాశం లేదు.

ఒక సినిమాని 4K కి రీ స్టోర్ చెయ్యాలంటే కచ్చితంగా 20 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. అంటే పది లక్షల రూపాయిలు నష్టం వచ్చింది అన్నమాట. ఇంత పూర్ రెస్పాన్స్ ని అభిమానులు ఊహించలేదు. ఈ వసూళ్లను పట్టుకొని ప్రభాస్ దురాభిమానులు సోషల్ మీడియా లో నెగటివ్ ట్రోల్ల్స్ చేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus