Chaurya Paatam Review in Telugu: చౌర్య పాఠం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ఇంద్ర రామ్ (Hero)
  • పాయల్ రాధాకృష్ణ (Heroine)
  • రాజీవ్ కనకాల,సలీమ్ ఫేకు,అంజి వల్గుమాన్,మాడి మానేపల్లి,ఎడ్వర్డ్ పెరేజీ,సుప్రియ ఐసోలా,క్రీష్ రాజ్ (Cast)
  • నిఖిల్‌ గొల్లమారి (Director)
  • త్రినాధరావు నక్కిన ,వి. చూడమణి (Producer)
  • డావ్‌జాంద్ (Music)
  • సతీష్ మెంటెమ్ (Cinematography)
  • Release Date : 25 ఏప్రిల్ 2025

దర్శకుడు త్రినాధరావు నక్కిన నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా “చౌర్య పాఠం” (Chaurya Paatam). గత రెండేళ్లుగా మేకింగ్ లో ఉన్న ఈ సినిమా పలుమార్లు వాయిదాపడి ఎట్టకేలకు ఇవాళ (ఏప్రిల్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంద్ర రామ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించగా.. కార్తీక్ ఘట్టమనేని కథ అందించడంతోపాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించాడు. మరి ఈ క్రైమ్ కామెడీ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం..!!

Chaurya Paatam Review

కథ: సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ, ఎప్పటికైనా దర్శకుడిగా ఒక సినిమా చేయాలని తపిస్తుంటాడు వేదాంత్ రామ్ (ఇంద్ర రామ్). చాన్నాళ్ళపాటు నిజాయితీగా ప్రయత్నించి, అలా ఎప్పటికీ వర్కవుట్ అవ్వదు అని క్లారిటీ వచ్చాక, ఏం చేయాలో తోచక తన ఏకైక స్నేహితుడు లక్ష్మణ్ (మ్యాడీ), బాంబులు పేల్చే బబ్లు (మస్త్ అలీ), డబ్బుల కోసం ఎలాంటి పనైనా చేసే జాక్ (అంజి)లతో కలిసి ధనపాలి అనే గ్రామానికి అక్కడి బ్యాంక్ చోరీకి ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుని వెళతాడు.

వేదాంత రామ్ & గ్యాంగ్ అక్కడి బ్యాంక్ లో చోరీని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయగలిగారా? అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? అనేది “చౌర్య పాఠం” కథాంశం.

నటీనటుల పనితీరు: ఇంద్ర రామ్ ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి. డైలాగ్ డెలివరీ & స్క్రీన్ ప్రెజన్స్ విషయంలో పర్వాలేదు కానీ, హావభావాల ప్రకటన విషయంలో ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. మస్త్ అలీ, అంజి, మ్యాడీలు తమదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను నవ్వించే ప్రయత్నం చేసారు. పాయల్ రాధాకృష్ణ డీసెంట్ యాక్టింగ్ తోపాటు గ్లామర్ కూడా యాడ్ చేసింది.

సుప్రియ ఐసోల ఈ సినిమాకి సర్ప్రైజ్ ఫ్యాక్టర్. ఆమె పాత్రలోని షేడ్స్ బాగున్నా.. ఇంకాస్త ప్రొపర్ గా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. రాజీవ్ కనకాల పాత్ర చిన్నదే అయినా, కొద్దిపాటి హాస్యాన్ని పండించారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు నిఖిల్ గొల్లమారి సీన్ కంపోజిషన్ మీద క్లారిటీ ఉన్నప్పటికీ, ఎగ్జిక్యూషన్ లో మాత్రం తడబడ్డాడు. ఆ కారణంగా సన్నివేశాలను తెరకెక్కించిన తీరు షార్ప్ గా లేక ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాడు.

కార్తీక్ ఘట్టమనేని మార్క్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాలో లోపించింది. లైటింగ్ విషయంలో కేర్ తీసుకున్నప్పటికీ, కెమెరా యాంగిల్స్ & ఫ్రేమ్స్ సినిమా జోనర్ కి తగ్గ స్థాయిలో లేవు.

దవ్జాండ్ పాటలు కొన్ని క్యాచీగా ఉన్నా.. కొన్ని మాత్రం మింగుడుపడలేదు. నేపథ్య సంగీతం ఎక్కువసార్లు రిపీట్ అయ్యింది. అందువల్ల ఎమోషన్స్ కానీ, ట్విస్టులు కానీ అవ్వాల్సినంతగా ఎలివేట్ అవ్వలేదు. ఉతుర పార్థసారథి ఎడిటింగ్ వర్క్ క్రిస్పీగా ఉంది. కట్స్ & ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.

ఆర్ట్ & ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కష్టపడ్డారు కానీ, క్వాలిటీ లోపించింది. అది బడ్జెట్ పరిమితుల వల్ల కూడా కావచ్చు.

విశ్లేషణ: క్రైమ్ కామెడీ సినిమాలకు టెక్నికాలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే.. బడ్జెట్ పరిమితుల వల్లనో లేక సరైన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయకపోవడం వలనో చాలాచోట్ల లొసుగులు కనిపించాయి. ముఖ్యంగా.. మాంటేజ్ షాట్స్ & యానిమేటెడ్ ఎపిసోడ్స్ రిపీటెడ్ గా ఉన్నాయి. అలాగే.. టన్నెల్ ఎపిసోడ్స్ ను ఇంకాస్త నీట్ గా ప్లాన్ చేయాల్సింది. ఇలాంటివి లోపించడంతో కథలోని కోర్ పాయింట్ & కొన్ని ట్విస్టులు బాగున్నప్పటికీ.. కథనంలో కొరవడిన వేగం, ఆసక్తి కారణంగా “చౌర్య పాఠం” ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది.

ఫోకస్ పాయింట్: ప్రేక్షకులను అలరించలేకపోయిన చోరకుల పర్వం!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus