Chello Show: ‘ఛెల్లో షో’ను తక్కువ ధరకే చూపించాలనుకుంటున్నారు!

Advertisement

ఎన్నో భారీ చిత్రాలను కాదని.. ఈ ఏడాది ఆస్కార్‌ పురస్కాల రేసులో ఉత్తమ విదేశీ చిత్రంగా భారత్‌ ‘ఛెల్లో షో’ను పంపించింది. ఈ గుజరాతీ సినిమా గొప్పతనం గురించి ఓవైపు చెబుతుంటే.. మరికొందరేమో మన సినిమాలు ఏం తక్కువ అని అడుగుతున్నారు. ఈ చర్చ కాసేపు పక్కన పెట్టేస్తే.. అసలు ఆ సినిమాలో ఏముంది, కథేంటి, ఎలా తీశారు అని కొంతమంది ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిలో మీరు కూడా ఉంటే.. మీకు గుడ్‌ న్యూస్‌.

ఆ సినిమాను తక్కువ ధరకే చూపించాలని టీమ్‌ నిర్ణయించందట. ప్రతిష్ఠాత్మక 95వ అకాడెమీ అవార్డుల చిత్రోత్సవాల్లో బరిలో ఉన్న మా సినిమాపై భారతీయ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాను ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’గా గురువారం దేశంలోని ముఖ్యమైన నగరాల్లో 95 థియేటర్లలో విడుదల చేస్తున్నాం అని టీమ్‌ ఇటీవల ప్రకటించింది. అంతేకాదు సినిమా టికెట్‌ ధరను రూ.95గా నిర్ణయించినట్లు కూడా టీమ్‌ చెప్పింది. ఈ మేరకు దర్శకుడు పాన్‌ నళిన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇక ఈ సినిమా కథ చూస్తే… సినిమాలంటే తీవ్రంగా అభిమానించే ఓ తొమ్మిదేళ్ల కుర్రాడి కథే ‘ఛెల్లో షో’ / ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’. దర్శకుడు నళిన్‌ స్వీయ అనుభవాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రాయ్‌ కపూర్‌ ఫిల్మ్స్, జుగాడ్‌ మోషన్‌ పిక్చర్స్‌ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రత్యేక షోను (రాత్రి 10:40) గురువారానికి మాత్రమే పరిమితం. హైదరాబాద్‌లో కూకట్‌పల్లి నెక్సస్‌ పీవీఆర్‌ మాల్‌లో వేస్తున్నారు.

అయితే ఇప్పుడు బుక్‌మై షోలో చూస్తే ఫుల్‌ అని వస్తోంది. మరి ఈ రోజు, రేపు ఉదయం ఏమన్నా షోలు పెంచుతారా? లేక ఒక్క షోకే పరిమితం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ సినిమాను హైదరాబాద్‌లో ఒక్క షో వేయడం ఏంటో తెలియడం లేదు. అలా అని 14వ తేదీ (నిజానికి ఈ రోజు సినిమా రిలీజ్‌) షోలు పడతాయా అంటే.. బుకింగ్స్‌లో కనిపించడం లేదు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus