తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత దళపతి విజయ్ (Vijay) నుంచి వచ్చిన తొలి, బహుశా అతని యాక్టింగ్ కెరీర్‌కే చివరి సినిమా ‘జన నాయగన్’. నేడు అంటే జూలై 23 గురువారం నాడు వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కావడంతో తమిళనాడులోని థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అయితే, సినిమా రిజల్ట్ కంటే కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో వద్ద తళుక్కున మెరిసిన ఓ స్పెషల్ గెస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.ఆ స్పెషల్ గెస్ట్ మరెవరో కాదు.. విజయ్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్, సౌత్ క్వీన్, స్టార్ హీరోయిన్ త్రిష.
చెన్నైలోని ఫేమస్ రోహిణి థియేటర్‌కు ఈ సుందరి రాగానే ఫ్యాన్స్ కేకలతో ఆ ఏరియా దద్దరిల్లింది. ఎప్పటినుంచో విజయ్, త్రిషల (Trisha) మధ్య రిలేషన్ ఉందంటూ వస్తున్న రూమర్లకు ఎప్పటికప్పుడు బలం చేకూరుస్తూనే ఉంది త్రిష. అందులో భాగంగానే.. ఇప్పుడు ఆమె ఏకంగా థియేటర్‌కు వచ్చింది అని చెప్పాలి. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఓ న్యూస్ ఛానల్‌తో త్రిష షేర్ చేసుకున్నారు.
త్రిషతో పాటు మరో హీరోయిన్ కీర్తి సురేష్ వెట్రి థియేటర్లో ఈ మూవీ స్పెషల్ షో చూశారు. డైరెక్టర్ హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.. టాలీవుడ్ సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’కి పార్షియల్ రీమేక్ కావడం విశేషం. ‘కె వి ఎన్ ప్రొడక్షన్స్’ సంస్థ నిర్మించిన ఈ సినిమా విజయ్ పొలిటికల్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ లో శ్రీలీల కూతురు పాత్ర పోషించగా తమిళంలో మమితా బైజు కూతురు పాత్ర పోషించింది. అలాగే హీరోయిన్ గా ఇక్కడ కాజల్ నటిస్తే.. అక్కడ పూజా హెగ్డే నటించింది.
Speaking to CNN-News18 ahead of the worldwide release of ‘Jana Nayagan’, actor Trisha said, “We are looking forward!” as excitement builds around Tamil Nadu Chief Minister C. Joseph Vijay’s latest film. @Rohini_Swamy | #Trisha #JanaNayagan #Vijay #TamilCinema #MovieRelease pic.twitter.com/hoEKVdEqFD
— News18 (@CNNnews18) July 23, 2026