మరోసారి ప్రముఖ రైటర్ పై మండిపడ్డ చిన్మయి..!

  • December 28, 2019 / 01:17 PM IST

ఎంతో మంది అమ్మాయిలను లైంగికంగా వేధించినప్పటికీ .. ‘తమిళ భాషకు ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివి అంటూ.. ఆయన్ని గౌరవిస్తూ రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్.. ప్రముఖ రచయిత వైరముత్తును సత్కరించడం’ చాలా బాధాకరం అంటూ చెప్పుకొస్తుంది సింగర్ చిన్మయి. ఆమె మాట్లాడుతూ… ‘మరోసారి మీకు ఓ విషయాన్ని గుర్తుచేయాలనుకుంటున్నాను… ఎప్పుడైనా ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఏమీ కాదు. ఆరోపణలు చేసిన వారికే పని దొరక్కుండా చేస్తుంటారు. తమిళ భాష పట్ల వైరాముత్తుకు ఉన్న ఇష్టాన్ని, గౌరవాన్ని గుర్తించి డాక్టరేట్ ఇస్తున్నారని నాకు తెలుసు. అదే విధంగా ఉత్తమ కామాంధుడు అనే పురస్కారం కూడా ఆయనకే ఇస్తే బాగుంటుంది’ .

‘నేను చేసిన ఆరోపణల పై ఎవరూ విచారణ జరపకపోగా ప్రముఖుల చిత్రాల్లో ఆయనకి అవకాశాలు ఇస్తూ .. ఆయన్ని మరింత కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. లోకమంతా ఆయనకు కీర్తి కండువా కప్పుతోంది. ఇక నన్ను ట్రోల్ చేస్తున్న వారికి ఒక్క విషయం చెప్తున్నా.. మీ జీవితంలోనూ వైరముత్తు లాంటి వ్యక్తి ఉండి ఉంటే అప్పుడు నేనెంత బాధపడ్డానో మీకు తెలిసొచ్చేది. అనుభవాన్ని మించిన గురువు మరొకటి లేదు. నేను కేవలం న్యాయం కావాలని అడుగుతున్నాను. నా ఆరోపణలు విని ఓ కామాంధుడి అభిమానులు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడంలేదు’ అంటూ మండిపడింది చిన్మయి.

1

2

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus