Chiranjeevi: ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఫలితంపై తొలిసారి స్పందించిన చిరు

చిరంజీవిని (Chiranjeevi) చాలా ఏళ్లుగా ఫాలో అయ్యేవారికి ఈ విషయం బాగా తెలుసు. రీసెంట్‌గా ఫాలో అవుతున్నవాళ్లకు అయితే ఆ సినిమా ఓ ప్రతిష్ఠాత్మక చిత్రం అని మాత్రమే తెలుసు. అదే ‘సైరా’ (Sye Raa) . చిరంజీవి హీరోగా రామ్‌చరణ్‌ నిర్మించిన చిత్రమిది. సురేందర్‌ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాక మంచి స్పందనే వచ్చినా ఆశించిన వసూళ్లు రాలేదని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఎక్కడా సినిమా టీమ్‌ దీని గురించి స్పందించలేదు. అయితే ఇటీవల చిరంజీవి ఓ వేడుకలో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఓ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ తన పాత్రల గురించి, సినిమాల గురించి మాట్లాడారు. ఇప్పటివరకూ తాను చేసిన పాత్రలు, సినిమాలతో పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని చెప్పలేనని అన్నారు చిరంజీవి. మనం ఎదురుచూసే పాత్రలు మనమెంత ప్రయత్నం చేసినా రావని, వాటంతట అవే స్వయంగా రావాలి అని చిరంజీవి చెప్పారు. తనకు ఫ్రీడమ్‌ ఫైటర్‌గా చేయాలని ఉండేదని… అందుకే ‘సైరా’ సినిమా చేశానని చెప్పారు. అయితే ఆ సినిమా వసూళ్లు ఇబ్బంది పెట్టాయని చెప్పారు.

‘సైరా’ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో యావరేజ్‌గా నిలిచిందని, మిగిలిన చోట్ల బాగానే ఆడిందని చెప్పారు చిరంజీవి. అయితే సినిమా స్పందన విషయంలో బాధ లేదని చెప్పారు. అయితే ఆ సినిమా వల్ల చాలానే నష్టపోయామని, నా సంతృప్తి కోసం సినిమా చేస్తే, ప్రొడ్యూసర్‌ జేబు ఖాళీ అవుతుందని తన ఆందోళనను వ్యక్తం చేశారు. అందుకే మంచి కంటెంట్‌ కోసం ఎదురుచూస్తున్నాని చెప్పారు. దీంతో చిరంజీవి మనసులో ఇంకేదో సినిమా ఉంది అని అర్థమవుతోంది.

దీంతో పాటు రామ్‌ చరణ్‌తో (Ram Charan) కలిసి జాన్వీ (Janhvi Kapoor) ఓ సినిమా చేస్తోందని, ఇటీవల ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం భావోద్వేగంగా అనిపించిందని చెప్పారు చిరు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు శ్రీదేవి గుర్తుకువచ్చిందని, ఇండస్ట్రీ మంచి నటిని కోల్పోయిందని ఆమెను గుర్తు చేసుకున్నారు. అలాగే ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ సినిమా సీక్వెల్‌లో చరణ్‌, జాన్వీ నటిస్తే చూడాలని ఉందని తన మనసులో మాట మరోసారి చెప్పారు చిరంజీవి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus