తల్లిదండ్రులు ఏమి చేసిన తమ పిల్లల ఆనందం కోసమే చేస్తారు. కానీ పిల్లలు దానిని అలుసుగా తీసుకొని తప్పులు మీద తప్పులు చేస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహ విషయంలో అదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి అందరికి తెలుసు.. ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంటుంది.. ఏదొక వార్తతో హాట్ టాపిక్ అవుతుంది.. గత కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉన్న శ్రీజ విడాకులు తీసుకుందని వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..
అయిన ఏమి పట్టించుకోకుండా తన పిల్లలతో కలిసి తల్లి దండ్రుల వద్దే ఉంటుంది.. నిజానికి ఈ అమ్మడుకు ఇది రెండో వివాహం.. మొదట ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. అతనితో ఓ బిడ్డను కన్న తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది.. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన అబ్బాయిని రెండో పెళ్లి చేసుకుంది.. అతనితో కూడా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు.. ఇక ఇప్పుడు మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిగా ఎవరికీ వారే దూరంగా ఉంటున్నారు.. ఈ విషయం పై గత ఏడాది నుంచి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి..
ఈ వార్తలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు.. అందరికి షాక్ ఇచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇలా ఎన్ని వార్తలు వస్తున్నా కూడా లైట్ తీసుకోవడం, ఎంత చెప్పినా కూడా శ్రీజ వినలేదని చిరంజీవి దిగులు పెట్టుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావడంతో బాధ పడ్డారని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు..అయితే చిరంజీవి తల్లి ఓ సలహా ఇవ్వడంతో కాస్త బెంగ తగ్గిందని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు..
ఇటీవల కాలంలో శ్రీజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి.ఆ విషయాన్ని శ్రీజ వాళ్ల నానమ్మకు చెప్పిందట.. జీవితం అంటే ఒక వ్యక్తితోనే అయిపోదు.. నిన్ను కంట్రోల్ చేసి బాధపెట్టే వాళ్లకు నువ్వు దూరంగా ఉండు.. నీ మనసుకు ఏది మంచిగా అనిపిస్తే అది నువ్వు చెయ్యి.. అని శ్రీజకు మంచి సలహా ఇచ్చిందట.. దాంతో ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉందని చిరు చెప్పాడు.. ప్రస్తుతం ఈ మాటలపై మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.. కూతురు శ్రీజ విషయంలో తప్పు చెయ్యకండి అంటూ సలహా ఇస్తున్నారు.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!