Chiranjeevi: సీనియర్ హీరోలలో చిరంజీవి నంబర్ వన్ స్టార్ .. కానీ?

  • February 12, 2024 / 01:10 PM IST

మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాలలోని ఎంతోమంది అభిమానులకు స్పూర్తి అనే సంగతి తెలిసిందే. బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్ పరంగా ఎదగాలని భావించే ఎంతోమంది చిరంజీవిని ఎంతగానో అభిమానిస్తారు. విశ్వంభర సినిమా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సీనియర్ హీరోలలో ప్రస్తుతం చిరంజీవి నంబర్ వన్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విశ్వంభర సినిమాకు భారీ రేంజ్ లో ఖర్చవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు థియేట్రికల్ హక్కుల రూపంలోనే 230 నుంచి 250 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగే అవకాశం ఉంది.

భారీ బడ్జెట్ సినిమాలకు ఈ రేంజ్ లో బిజినెస్ జరిగితే కనీసం 300 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే మాత్రమే చిరంజీవి ఖాతాలో అరుదైన రికార్డులు చేరే అవకాశం ఉంటుంది. చిరంజీవి ఆ రేర్ రికార్డ్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాలి. చిరంజీవి సినీ కెరీర్ లో హిట్ ఫ్లాపులు కొత్త కాదు. అయితే ఫ్లాప్ వచ్చిన ప్రతి సందర్భంలో చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ తో భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి.

చిరంజీవి విశ్వంభర సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటి ఇతర భాషల్లో మార్కెట్ ను పెంచుకుంటారేమో చూడాలి. మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లు సైతం భారీ లెవెల్ లోనే ఉండబోతున్నాయి. చిరంజీవి, చరణ్ సినిమాలు బడ్జెట్ విషయంలో సేమ్ టు సేమ్ అని కొంతమంది మెగా అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. భోళా శంకర్ నిరాశ పరచగా ఈ ఏడాది చిరంజీవి సినిమాలేవీ థియేటర్లలో విడుదల కావడం లేదు.

విశ్వంభర జనవరి నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా మెగా అభిమానులకు విందు భోజనంలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. మల్లిడి వశిష్టకు చిరంజీవి అంటే ఎంతో అభిమానమని చిరంజీవికి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చేలా వశిష్ట ప్లానింగ్ ఉందని సమాచారం అందుతోంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus