Chiranjeevi farm house cost: మెగా ఫ్యామిలీ ఫోటోలో హైలెట్ అయిన ఫామ్ హౌస్ అన్ని కోట్లా?

  • January 19, 2024 / 02:18 PM IST

మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫ్యామిలీ ఫోటోలు.. ఇటీవల తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి, రాంచరణ్..లతో పాటు అల్లు అర్జున్, అల్లు అరవింద్ వంటి వారు కూడా ఈ ఫొటోలో ఉండటం అభిమానుల ఆనందానికి కారణమైంది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా ఈ ఫొటోల్లో, వీడియోల్లో కనిపించారు. అయితే మెగా ఫ్యామిలీ అంతా కలిసి సంక్రాంతి పండుగను చిరంజీవి ఫామ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకోగా… అక్కడ వీరంతా కలిసి సందడి చేసినట్లు తెలుస్తుంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి ఫామ్ హౌస్ విషయానికి వస్తే… అది బెంగళూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేహన హల్లిలో ఉంటుంది. అలాగే చిరు ఫామ్ హౌస్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి చాలా దగ్గర్లో ఉంటుంది. ఇక దీని ధర తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వక తప్పదు. ఇప్పటి మార్కెట్ లెక్కల ప్రకారం.. చిరు ఫామ్ హౌస్ ఏకంగా రూ.30 కోట్ల పైనే విలువ చేస్తుందట. చిరు- చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ కొంత జరిగింది.

విలన్స్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించినట్టు తెలుస్తుంది. చిరుకి (Chiranjeevi) చాలా ఇష్టమైన ఫామ్ హౌస్ ఇది. పెద్దగా ట్రాఫిక్ గోల లేకుండా ప్రశాంత కరమైన వాతావరణాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో చిరు తన ఇంట్లో వాళ్ళని తీసుకుని పండుగల టైంకి ఇక్కడి వచ్చేస్తూ ఉంటారట. ఈ విధంగా 2024 సంక్రాంతి సెలబ్రేషన్స్ ను కూడా ఆయన ఈ ఫామ్ హౌస్ లో నిర్వహించడం జరిగింది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus