Chiranjeevi: ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో చిరంజీవి సినిమాలు లేనట్టేనా?

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో వరుసగా సినిమాలలో నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి రీఎంట్రీలో ఖైదీ నంబర్150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ఆచార్య సినిమా ఫలితం చిరంజీవిని తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. అయితే చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలను పండుగలకు రిలీజ్ కానుండగా భోళా శంకర్ సినిమా మాత్రం సమ్మర్ లో రిలీజ్ కానుంది.

అయితే ఈ ప్రాజెక్ట్ లు మినహా చిరంజీవి మరే కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. అయితే చిరంజీవి ముగ్గురు టాలీవుడ్ డైరెక్టర్లకు భారీ షాక్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. సుజిత్, మారుతి, వెంకీ కుడుముల డైరెక్షన్ లో చిరంజీవి ప్రాజెక్ట్ లు లేనట్టేనని తెలుస్తోంది. చిరంజీవితో ఈ డైరెక్టర్ల ప్రాజెక్ట్ లు క్యాన్సిల్ అయ్యాయని బోగట్టా. యంగ్ జనరేషన్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడానికి చిరంజీవి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సీనియర్ డైరెక్టర్ల డైరెక్షన్ లోనే తెరకెక్కనున్నాయని బోగట్టా. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల సినిమాలు విడుదలైన తర్వాతే చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని బోగట్టా. చిరంజీవి ఒక్కో ప్రాజెక్ట్ కు 40 నుంచి 45 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే చిరంజీవికి క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

చిరంజీవి ప్రాజెక్ట్ ల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి తన సినిమాలు మల్టీస్టారర్ సినిమాలుగా తెరకెక్కే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus