Chiranjeevi, Balakrishna: బాలయ్య ఆ సినిమా చిరు ఇంట్లోనే షూటింగ్ చేశారా?

  • April 27, 2023 / 03:30 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతూ ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి వారిలో సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి వంటి వారు ఒకరు. ఈ హీరోలు ఇద్దరూ కూడా సినిమాల పరంగా నువ్వా నేనా అనేలా పోటీ పడుతూ పెద్ద ఎత్తున సినిమాలలో నటిస్తున్నారు. అయితే ఈ పోటీ కేవలం సినిమాల వరకు మాత్రమేనని వ్యక్తిగత జీవితంలో చాలా మంచి స్నేహితులనే చెప్పాలి.

ఇలా ఇద్దరు హీరోలు వ్యక్తిగతంగా చాలా స్నేహభావంతో మెలుగుతూ ఉంటారు. ఇప్పటికి ఇద్దరు ఎదురుపడిన ఎంతో మర్యాదపూర్వకంగా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటారు. బాలకృష్ణ నటించిన ఓ సినిమా కోసం చిరంజీవి తన ఇంటిని ఇచ్చారనే విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. బాలకృష్ణ తన సినీ కెరియర్లో 50వ సినిమాగా నారి నారి నడుమ మురారి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీ 1990 లోప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయాన్ని అందుకుంది ఈ సినిమా బాలకృష్ణకు ఎంతో స్పెషల్ అనే చెప్పాలి.

ఇలా తన 50వ సినిమా బ్లాక్ బస్టర్ కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్ దాదాపు 90% మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ హౌస్ లోనే పూర్తి చేశారు. చెన్నైలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ఇష్టమైనటువంటి హనీ హౌస్ అనే గెస్ట్ హౌస్ ఉంది. ఈ గెస్ట్ హౌస్ చెన్నైలోని వెల్లిచ్చెరి ప్రాంతంలో ఉంది. ఈ గెస్ట్ హౌస్ అంటే చిరంజీవికి చాలా ఇష్టమట ఇక ఈ హౌస్ పక్కనే రెండు ఎకరాల స్థలం కూడా ఉందని అది కూడా మెగాస్టార్ చిరంజీవిదేనని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ కోసం తన గెస్ట్ హౌస్ ని అడగడంతో చిరంజీవి (Chiranjeevi) వెంటనే షూటింగ్ కోసం గెస్ట్ హౌస్ ఇచ్చేసారని తెలుస్తోంది.ఇలా బాలయ్య సినిమా కోసం తన ఇంటిని ఇచ్చారంటే చిరంజీవి బాలకృష్ణ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తమ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus