Chiranjeevi, Dil Raju: దిల్ రాజు డైలాగ్ తో చిరు కామెడీ.. వీడియో వైరల్

  • August 8, 2023 / 10:54 AM IST

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు … ఈ ఏడాది సంక్రాంతి సినిమాల విషయంలో బాగా ట్రోల్ అయ్యారు. ఎందుకంటే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకి పోటీగా తన ‘వారసుడు’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేశాడు. విజయ్ నటించిన డబ్బింగ్ సినిమా గురించి అంత హడావిడి అవసరమా అంటూ అందరూ దిల్ రాజుని ట్రోల్ చేయడం జరిగింది. ఆ టైంలో దిల్ రాజు ‘వారసుడు’ తమిళ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన వచ్చీరాని తమిళంలో మాట్లాడి ఇంకా ఎక్కువగా ట్రోల్ అయ్యాడు.

‘ఐ యామ్ వెయిటింగ్ సార్ క్యాబిన్… డోర్ ఓపెన్ ఆయిచ్చు. సార్ ఎంట్రీ విత్ టు కాఫీ కప్స్. టు మీట్ సర్ ఈజ్ గివెన్ ఫస్ట్ టైం కాఫీ.. అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్.. అది ద సార్’ అంటూ దిల్ రాజు అనడం మీమర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చినట్టు అయ్యింది. దానికి ముందు ‘డాన్స్ వెనుమా డాన్స్ ఇరుక్కు, ఫైట్ వెనుమా ఫైట్ ఇరుక్కు..

అది ఇరుక్కు.. ఇది ఇరుక్కు’ అంటూ ఆ ట్రోల్స్ చూసి దిల్ రాజే ఎంజాయ్ చేయడం మనం చూశాం. ఇదిలా ఉండగా.. తాజాగా దిల్ రాజు డైలాగులు చిరు నోట వినపడటం అందరినీ ఆశ్చర్యపరిచాయి అని చెప్పాలి. ‘భోళా శంకర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీంతో కలిసి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చిరు ‘ఎంటర్టైన్మెంట్ వెనుమా.. ఎంటర్టైన్మెంట్ ఇరుక్కు.. గ్లామర్ ఇరుక్కు’ అంటూ దిల్ రాజుని ఇమిటేట్ చేశారు చిరు. ఆగస్టు 11న ‘భోళా శంకర్’ సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక చిరు (Chiranjeevi) దిల్ రాజుని ఇమిటేట్ చేసిన వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus