Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

సరైన విజయం కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న గుణశేఖర్‌.. ఇటీవల ‘యుఫోరియా’ అంటూ మరో ప్రయత్నం చేశారు. చేసిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు మెచ్చుకున్నా.. ఫలితం మాత్రం ఆశించినట్లుగా రాలేదు. మిక్స్‌డ్‌ టాక్‌ అంటూ కాస్త అటు ఇటు ఫలితం అందుకున్న సినిమాకు ఆశించిన మేర వసూళ్లు రాలేదు. దీంతో ఆయన హిట్‌ కోసం మరో ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ విషయం అటుంచితే ‘యుఫోరియా’ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు.

Chiranjeevi

‘యుఫోరియా’ సినిమాలో ఓ కీలక పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించారు. సినిమాలో కీలక సమయంలో వచ్చే పోలీస్ ఆఫీసర్ పాత్ర అది. ఈ పాత్ర గురించి తనకు తొలుత వచ్చిన ఆలోచనల గురించే చెప్పారు గుణశేఖర్‌. ఆ పాత్ర కోసం తొలుత ప్రముఖ కథానాయకుడు చిరంజీవిని తీసుకోవాలని గుణశేఖర్ అనుకున్నారట. అంతేకాదు దీని గురించి చిరంజీవితో డిస్కషన్‌ కూడా చేశారట. ఆ క్యారెక్టర్‌ చేయడానికి చిరంజీవి కూడా ఇంట్రెస్ట్ చూపించారట.

అయితే ప్రస్తుతం చిరంజీవి ఉన్న స్టేజీలో స్పెషల్ రోల్స్ చేయడం మంచిది కాదేమో అని భావించి తర్వాత నో చెప్పారట. అలా ‘యుఫోరియా’ సినిమాలో చిరంజీవి లేకుండా పోయారు. ఒకవేళ ఆ పాత్ర చేసి ఉంటే సినిమాకు వచ్చే హైప్‌ మామూలుగా ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఆ పాత్రపై గుణశేఖర్ మాటలు విన్నాక ‘చిరంజీవి ఒకవేళ చేసి ఉంటే ఎలా ఉండేది’ అంటూ లెక్కలేసుకుంటున్నారు. చిరు ఆ పాత్రలో నటించి ఉంటే కచ్చితంగా సినిమా మీద మరింత సాలిడ్ ఇంపాక్ట్ వచ్చేది. వసూళ్లు, ఓపెనింగ్స్‌ కూడా వచ్చేవి.

అయితే, సినిమా ఫలితం తేడా కొడితే చిరంజీవి ఫ్యాన్స్‌ బాగా హర్టయ్యేవారు. నాగార్జున ఎంతో ఇష్టపడి ‘కూలీ’ సినిమాలో విలన్‌గా నటించారు. ఆ సినిమా ఫలితం తేడా కొట్టేసరికి నాగ్‌ ఫ్యాన్స్‌ హర్టయిపోయారు. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్‌ కూడా అదే పరిస్థితిలో ఉండేవారు. చూద్దాం తర్వాత ఎప్పుడైనా చిరంజీవి ఇలాంటి ప్రయత్నం చేస్తారేమో. గతంలో అంటే ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నప్పుడు చిరంజీవి ఇలా నటించిన విషయం గమనార్హం.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus