‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ టు ‘వాల్తేరు వీరయ్య’.. చిరంజీవి గత 10 సినిమాల కలెక్షన్స్ లిస్ట్..!

  • January 21, 2023 / 12:34 PM IST

ఎక్కడో మొగల్తూరు నుండి చెన్నై వచ్చి .. యాక్టింగ్ స్కూల్ లో కోర్స్ నేర్చుకుని..అతిథి పాత్రలు, నెగిటివ్ పాత్రలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శివ శంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి.. ఆ తర్వాత హీరోగా మారి అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈయన స్టార్ గా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. టాలీవుడ్లో ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు కొట్టిన హీరోగా ఓ రికార్డు క్రియేట్ చేశారు చిరంజీవి. టాలీవుడ్లో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి హీరోగా ఈయన బిగ్గెర్ దేన్ బచ్చన్ గా ఈయన రికార్డు సృష్టించారు.

అయితే అనూహ్యంగా 2009 లో సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఈయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం.. అక్కడ చాలా స్ట్రగుల్ అవ్వడం మనం చూశాం. అయితే 2017 లో తిరిగి ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి స్టార్ హీరోలకు కూడా ఈయన గట్టిపోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా.. చిరు హీరోగా నటించిన గత పది చిత్రాల ఫలితాలు మరియు వాటి కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి :

1) శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ :

జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ మూవీ రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.27.26 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

2) అందరివాడు :

శ్రీను వైట్ల దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ మూవీ రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.20 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

3) జై చిరంజీవ :

కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రూ.28 కోట్ల టార్గెట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.18 కోట్ల కలెక్షన్స్ సాధించి డిజాస్టర్ గా మిగిలింది.

4) స్టాలిన్ :

మురుగదాస్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీ రూ.24 కోట్ల టార్గెట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఈ మూవీ రూ.26.96 కోట్ల షేర్ ను సాధించి హిట్ మూవీగా నిలిచింది.

5) శంకర్ దాదా జిందాబాద్ :

ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీ రూ.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.20 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. డిజాస్టర్ గా మిగిలింది.

6) ఖైదీ నెంబర్ 150 :

వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి రీ ఎంట్రీ మూవీగా అలాగే 150వ చిత్రంగా రూపొందిన ఈ మూవీ రూ.92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.104 కోట్ల వరకు షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.

7) సైరా నరసింహారెడ్డి :

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీ రూ.200 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.135 కోట్ల వరకు షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

8) ఆచార్య :

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చరణ్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ రూ.134 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి కేవలం రూ.47 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.

9) గాడ్ ఫాదర్ :

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన ఈ మూవీ రూ.92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.59 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

10) వాల్తేరు వీరయ్య :

బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన ఈ మూవీ రూ.87 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి.. మొదటి వారానికే రూ.95 కోట్ల వరకు షేర్ ను రాబట్టి.. సూపర్ హిట్ గా నిలిచింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి చేరడం కూడా పక్కా అని చెప్పాలి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus