Chiranjeevi: చిరంజీవి మార్పులు చెప్పిన తర్వాత ఆ పాట అదిరిపోయిందట!

  • January 16, 2024 / 11:20 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి – ఎం.ఎం. కీరవాణి… ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో పాటలు అన్నీ సూపర్‌ హిట్టే. సినిమా ఫలితం విషయంలో కాస్త అటు ఇటు అయి ఉండొచ్చు కానీ పాటలు మాత్రం అదిరిపోయాయ్‌ అంతే. ఈ కాంబోలో వచ్చిన పాటల్లో మీకు ఏది ఇష్టం అంటే పిక్‌ చేయడం అంత ఈజీ కాకపోవచ్చు. అయితే ‘ఘరానా మొగుడు’ సినిమాలో ‘బంగారు కోడిపెట్ట..’ పాట ఇష్టమా అని అడిగితే… ప్రత్యేకంగా అడగాలా అని అంటారు మెగా ఫ్యాన్స్‌. ఎందుకంటే తండ్రీ కొడుకులు ఇద్దరూ ఆ పాట వేర్వేరుగా చేశారు కాబట్టి.

అయితే, ‘ఘరానా మొగుడు’ సినిమాలోని ‘బంగారు కోడిపెట్ట..’ పాట తొలి ట్యూన్‌ ఇది కాదట. ఈ విషయాన్ని కీరవాణే చెప్పారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘నా సామిరంగ’ విడుదల సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన… ‘బంగారు కోడిపెట్ట..’ పాట గురించి ప్రస్తావించారు. నాగార్జున, చిరంజీవిల మ్యూజిక్ సెన్స్ గురించి మాట్లాడుతూ ఆ పాట గురించి ప్రస్తావించారాయన. నాగార్జున, చిరంజీవి ఒక్కోసారి కంపోజింగ్ దగ్గర కూర్చొని మాకు ఇలా కావాలి, అలా కావాలి అని అడిగేవారు అని చెప్పారు.

అయితే వాళ్లు అడిగే విధానం ఎప్పుడూ మ్యూజిక్ డైరెక్టర్‌ను ఇబ్బంది పెట్టేలా ఉండదని క్లారిటీ ఇచ్చారు. పాటల గురించి వాళ్లు అడిగడమే కాదు, అలా ఎందుకు కావాలి అనేది కూడా చెబుతారట. ‘ఘరానా మొగుడు’ సినిమా సమయంలో ‘బంగారు కోడిపెట్ట…’ పాట కోసం కీరవాణి వేరే ట్యూన్ చేశారట. అయితే ఆ ట్యూన్‌ డ్యాన్స్‌ స్టెప్స్ విషయంలో అంత అనుకూలంగా లేదని మార్పులు చేయండి అని అడిగారట (Chiranjeevi) చిరంజీవి. ఎలా ఉంటే బాగుంటుందో కూడా చెప్పారట.

అలా మార్పులు చేసిన పాటనే ఇప్పుడు అందరూ చూస్తున్నారు, డ్యాన్స్‌లు చేస్తున్నారు అని చెప్పారు కీరవాణి. ప్రస్తుతం ఆయన చిరంజీవి – మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాటల రికార్డింగ్‌ కొనసాగుతోందని కీరవాణి ఇటీవల చెప్పారు కూడా.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus