Chiranjeevi: చిరు.. ఈ 10 దర్శకులతో సినిమాలు ఎప్పుడు చేస్తారో..!

టాలీవుడ్లో నెంబర్ 1 హీరోల గురించి చెప్పుకోవాలి అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గురించి మాత్రమే చెప్పుకోవాలి. చిరు తర్వాత నెంబర్ 1 హీరో ఎవరూ లేరు. చిరు సినిమాలకు ఇప్పుడు ఓపెనింగ్స్ గతంలో మాదిరి రాకపోవచ్చు కానీ ఆయన మార్కెట్ ఇప్పటికీ రూ.100 కోట్లకు పైగా ఉంది. అలాంటి చిరు రీమేక్ లు, డబ్బింగ్ రీమేక్ లు అంటూ టైం వేస్ట్ చేయకుండా.. కొంతమంది టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇప్పటికైతే చిరు బాబీ, మెహర్ రమేష్ వంటి దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఆ తర్వాత వెంకీ కుడుములతో మూవీ అనుకున్నా… అది హోల్డ్ లో పడినట్టు వినికిడి. ఈ నేపథ్యంలో చిరు పలానా దర్శకుడితో సినిమా చేస్తే బాగుంటుంది అని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా 10 మంది దర్శకులతో చిరు సినిమా చేస్తే చూడాలని ఆశపడుతున్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

1) పూరి జగన్నాథ్ :

హిట్, ప్లాప్ వంటి వాటి గురించి ఆలోచించకుండా చిరంజీవి .. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అభిమానులు కోరుతున్నారు. పూరి సినిమాల్లో కథ మొత్తం హీరో క్యారెక్టరైజేషన్ తో ముడిపడి ఉంటుంది. అందుకే కొత్త చిరుని చూడొచ్చు అని చిరు అభిమానుల కోరిక. ‘మగధీర’ సినిమాలో చిరంజీవి ఎపిసోడ్ ను పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. రాజమౌళి కూడా ఓ సందర్భంలో ఈ విషయాన్ని తెలిపారు.

2)త్రివిక్రమ్ శ్రీనివాస్ :

‘జై చిరంజీవ’ సినిమా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కానీ త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగులు చిరు నోట వింటుంటే భలే ఉంటుంది. ఇప్పటికీ ఆ సినిమాలో కామెడీని ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఉన్నారు. కాబట్టి చిరు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తే చూడాలనేది అభిమానుల కోరిక.

3) సుకుమార్ :

సుకుమార్ అనగానే ఈ మధ్య ‘పుష్ప’ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. చిరుని ఓ స్టైలిష్ ప్రొఫెసర్ గా పెట్టి.. ‘మాష్టర్’ టైపులో ఓ సినిమా చేస్తే అదిరిపోద్ది.

4) రాజమౌళి :

ఈ కాంబోలో మూవీ చూడాలని యావత్ తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

5) బోయపాటి శ్రీను :

మన ఊర మాస్ డైరెక్టర్ తో సినిమా చేయాలని చిరుకి కూడా ఉంది. కానీ కథ సెట్ అవ్వడం లేదు. కథ ఓకే అయితే మాస్ రచ్చ ఖాయం.

6)అనిల్ రావిపూడి :

మాస్ ఎలివేషన్స్ ను అలానే కామెడీని తీర్చిదిద్దడంలో మన అనిల్ అన్న రూటే వేరు. బాలయ్య తర్వాత చిరుతో చేసేయ్ అన్న.

7) సందీప్ రెడ్డి వంగా :

చిరుతో మంచి ‘గ్యాంగ్స్టర్’ కథ చేయాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు సందీప్ సర్.

8) హరీష్ శంకర్ :

ఇప్పటివరకు తమ్ముడినే చూశాం.మరి అన్నయ్య సంగతేంటి హరీష్ బ్రో. పవన్ బిజీగా ఉంటే చిరుతో సినిమా చేసెయ్యి.

9) శంకర్ :

ఈయనతో సినిమా చేయాలని చిరు కలలు కన్నారు. కానీ అవకాశం చరణ్ కు దక్కింది. ఛాన్స్ ఉంటే చిరుతో కూడా శంకర్ ఓ సినిమా చేయాలి.

10) వి.వి.వినాయక్ :

‘ఠాగూర్’ ‘ఖైదీ నెంబర్ 150’ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్లు.! మరి హ్యాట్రిక్ కంప్లీట్ చెయ్యరా? చెయ్యాలి..! ఇదే అభిమానుల డిమాండ్.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus