మెగా స్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కేవలం కూతుర్ల కారణంగానే ఆయన మైనస్ అయిపోయారు. ఆయన ఎంత స్టేటస్ తెచ్చుకున్నప్పటికీ కూతురు చేసిన పని వల్ల చాలామంది మిగతా హీరోల అభిమానులు మాత్రం ఆయనను ఎప్పుడూ నెట్టింట్లో కూతుర్ల విషయంలో ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. అయితే గతంలో శ్రీజ వల్ల చిరంజీవి చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఇప్పటికి కూడా శ్రీజ వల్ల ఆయన బాధపడుతూనే ఉన్నారు.
అయితే శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ అనే అబ్బాయిని ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. చదువుకునే రోజుల్లోనే శిరీష్ తో ప్రేమలో పడ్డ శ్రీజ ఆ తర్వాత హైదరాబాదులో సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఢిల్లీలో కాపురం పెట్టిన సంగతి చాలామందికి తెలుసు. అయితే ఆ తర్వాత చిరంజీవి ఆస్తి పాస్తుల గురించి అన్ని తెలుసుకున్న శిరీష్ కట్నం తేవాలి అని శ్రీజని టార్చర్ చేయడం మొదలుపెట్టారు.
దాంతో శ్రీజ చేసేదేమీ లేక రాత్రిళ్లు భర్తకు తెలియకుండా చిరంజీవికి ఫోన్ చేసి చాలా ఏడ్చేదట. దీంతో చిరు ఆమెను ఎంతో ఓదార్చవాడుట. శ్రీజ అంటే చిరంజీవికి ఎనలేని ప్రేమ. ఆమె ఏదడిగినా కాదనరు. బాగా గారాబం చేస్తారు. తాజాగా శ్రీజ కు చిరంజీవి ఖరీదైన బహుమతి ఇచ్చినట్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఒక విలాసవంతమైన ఇంటిని చిరంజీవి (Chiranjeevi) కొనుగోలు చేశారు.
అన్నిరకాలుగా అన్ని సౌకర్యాలున్న ఆ ఇంటి విలువ రూ.35 కోట్లని తెలుస్తోంది. తన సినిమాల నుంచి వచ్చిన రెమ్యునరేషన్ సొమ్ముతో కొనుగోలు చేశారు. ప్రస్తుతం తాను తెరకెక్కిస్తున్న సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో హైదరాబాదులోని ఎమ్మెల్యే కాలనీలో తన చిన్న కూతురు శ్రీజ కోసం 35 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక అందమైన బంగ్లాను కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!
రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్ ఫోటోలు వైరల్!