Upasana: ఎమోషనల్ అయిన ఉపాసన.. చిరంజీవి తల్లి అలా చేయడంతో?

మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే. మరికొన్ని నెలల్లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఉపాసనను చిరంజీవి కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. చిరంజీవి కుటుంబ సభ్యులు చూపిస్తున్న కేరింగ్ కు ఉపాసన కూడా ఫిదా అవుతున్నారని తెలుస్తోంది. చిరంజీవి తల్లి అంజనమ్మ ఉపాసన కోసం స్పెషల్ వంటకాన్ని తయారు చేయించారు. ఈ వంటకానికి సంబంధించిన వీడియోను ఉపాసన తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

కొత్తిమీర, పుదీనాతో వేడి వేడి ఫులావ్ ను అంజనమ్మ తయారు చేయడం గమనార్హం. ఉపాసన షేర్ చేసిన ఈ వీడియోకు 1,40,000కు పైగా వ్యూస్ రావడంతో పాటు 17,000కు పైగా లైక్స్ రావడం గమనార్హం. చిరంజీవి తల్లి వయస్సు ఎక్కువే అయినా ఈ వయస్సులో కూడా ఆమె ఎంతో కష్టపడుతుండటాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అంజనమ్మ వంట చేయడంతో ఉపాసన ఎమోషనల్ అయ్యారని బోగట్టా. గర్భంతో ఉన్న ఉపాసన హెల్త్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఉపాసన (Upasana) చాలా టాలెంటెడ్ కాగా ఆమె సొంతంగా ఎన్నో బిజినెస్ లను నిర్వహిస్తున్నారు. ఉపాసన ఒకవైపు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు వ్యాపారాలను నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఉపాసన చరణ్ జోడీని ఎంతోమంది అభిమానిస్తున్నారు. మరోవైపు చరణ్ కూడా రెండు నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉంటూ ఉపాసనను ప్రేమగా చూసుకోనున్నారని కామెంట్లు వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఉపాసన నెల సంపాదన కళ్లు చెదిరే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఉపాసన కొత్త వ్యాపారాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చరణ్ విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. హాలీవుడ్ లో కూడా సత్తా చాటేలా చరణ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.


శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus