మెగాస్టార్ చిరంజీవి హీరోగా, స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ మూవీ 2026 సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మూవీ చూడటానికి చాలా ఏళ్ళ తరువాత పెద్ద వయసు వారు కూడా థియేటర్ల బాట పట్టారంటే, MSVPG ఏ రేంజ్లో హిట్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు OTT రిలీజ్ కి రెడీ అవుతుందట. అయితే అది ఏ రోజున అనేది చూసేద్దామా..
‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి సంబందించిన OTT హక్కులను ప్రముఖ సంస్థ జీ 5 దక్కించుకోగా, ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. అయితే జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ కేవలం నైజాం ఏరియాలోనే 30+ లక్షల మంది డైరెక్ట్ థియేటర్లలో సినిమా చూసారని చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మధ్యలో ఒక రీజినల్ మూవీకి ఒక్క ఏరియాలోని ఇంత మంది రావటం మొదటి సారి అంట. కాగా ఈ చిత్రంలో చిరు నటనతో పాటు, భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. స్వయంగా చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత మరియు సాహు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. విడుదలైన 15 రోజులలోనే 350+ కోట్ల కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం.