చిరు జోక్యం నచ్చట్లేదంట..!

అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరైనోడు’. ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే రెండు వారల నుండి ఈ సినిమాలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం డల్ గా ఉందని కొన్ని సీన్లను మార్చమని అల్లు అరవింద్, బోయపాటికి సూచించారు. దానికి తగ్గట్లుగా బోయపాటి దగ్గరుండి మరీ రీఎడిట్ చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ సినిమా విషయంలో చిరంజీవి జోక్యం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చిరు కూడా తనకు తోచిన సలహాలు ఇస్తున్నాడట. సినిమాకు సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇలా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు దూరమవుతారని ఆలోచించిన చిరు మరలా రీఎడిట్ చేసి సెన్సార్ కి పంపమని సూచించారట. అటు అల్లు అరవింద్, ఇటు చిరంజీవి తన విషయంలో జోక్యం చేసుకోవడం బోయపాటికి అసలు నచ్చట్లేదంట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus