Chiranjeevi: మంచు విష్ణు సినిమాలో మెగాస్టార్ అలాంటి పాత్రలో కనిపించనున్నారా?

  • November 26, 2023 / 07:00 PM IST

మంచు విష్ణు ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. జిన్నా సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కినా ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేదు. అయితే కన్నప్ప సినిమాతో మాత్రం సక్సెస్ ను సొంతం చేసుకుంటానని విష్ణు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కన్నప్ప మూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రభాస్ కన్నప్ప సినిమాలో కనిపించే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ జాబితాలో చిరంజీవి పేరు కూడా చేరింది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో చిరంజీవి కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే విడుదలైన కన్నప్ప పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచు విష్ణు ట్విట్టర్ పోస్ట్ కు ఏకంగా 11,600కు పైగా లైక్స్ వచ్చాయి.

మంచు విష్ణు తన ట్విట్టర్ పోస్ట్ లో ప్రభాస్ పేరును కూడా ప్రస్తావించడంతో ప్రభాస్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. కన్నప్ప సినిమా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమా బిజినెస్ ఆఫర్లు కూడా భారీ స్థాయిలోనే వస్తున్నాయని సమాచారం అందుతోంది. విష్ణు కన్నప్ప ప్రాజెక్ట్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

మంచు విష్ణు కన్నప్ప తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటారో చూడాల్సి ఉంది. మంచు విష్ణు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కన్నప్ప సినిమా 2024 భారీ సినిమాలలో ఒకటిగా నిలవనుందని సమాచారం అందుతోంది. మంచు విష్ణు కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus