Chiranjeevi, Jr NTR: బాల రామాయణం చూసి అలా చెప్పిన చిరంజీవి.. ఆ మాటలే నిజమయ్యాయిగా!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  ప్రస్తుతం సినిమాలపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. దేవర (Devara)  సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ సాధించి బాక్సాఫీస్ ను షేక్ చేస్తానని తారక్ నమ్మకంతో ఉన్నారు. పాజిటివ్ రోల్ అయినా నెగిటివ్ రోల్ అయినా తారక్ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు. తారక్ యాక్టింగ్ స్కిల్స్ వల్లే యావరేజ్ సినిమాలు సైతం సరికొత్త రికార్డులు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు బాల నటుడిగా (Bala Ramayanam) బాల రామాయణం సినిమా నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.

అయితే చిరంజీవి (Chiranjeevi)  చూడాలని ఉంది సమయంలో బాల రామాయణం సినిమా చూసి తారక్ స్టార్ హీరో అవుతాడని చెప్పారట. చిరంజీవి అంచనాలే నిజమై తారక్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండటం గమనార్హం. చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా భవిష్యత్తులో ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందేమో చూడాల్సి ఉంది. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara)  సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరినీ అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా ప్రస్తుతం టాప్ లో ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న తారక్ ప్రతి సినిమా భారీ లెవెల్ లో సక్సెస్ సాధించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీ వచ్చే ఏడాది మొదలయ్యే ఛాన్స్ అయితే ఉందని భోగట్టా. ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో మూవీ మైత్రీ బ్యానర్ పై తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus