Chiranjeevi, Rajasekhar: చిరంజీవి రాజశేఖర్ గురించి అలా అనుకున్నారా?

ప్రముఖ నటుడు, సీనియర్ హీరో రాజశేఖర్ కెరీర్ తొలినాళ్లలో సీరియస్ పాత్రల్లో ఎక్కువగా నటించిన సంగతి తెలిసిందే. రాజశేఖర్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో అల్లరి ప్రియుడు సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ లో మ్యూజికల్ హిట్ గా నిలిచిన సాజన్ మూవీ స్పూర్తితో అల్లరి ప్రియుడు సినిమా తెరకెక్కింది. అయితే రాజశేఖర్ రాఘవేంద్రరావు కాంబినేషన్ లో సినిమా ప్రకటన వెలువడగానే ఇండస్ట్రీలో చాలామంది ఆశ్చర్యపోయారు.

రాజశేఖర్, రాఘవేంద్రరావులకు ఇండస్ట్రీలో భిన్నమైన ఇమేజ్ ఉండటం వల్ల ఎవరు ఎవరి రూట్ లోకి వెళతారనే ప్రశ్నలు వినిపించాయి. అయితే రాజశేఖర్ రాఘవేంద్రరావు రూట్ లోకి వెళ్లి ఈ సినిమాలో నటించారు. అల్లరి ప్రియుడు సినిమాకు ముందు సినిమాల్లో స్టెప్స్ ను రాజశేఖర్ ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. అయితే అల్లరి ప్రియుడు సినిమాలో రాజశేఖర్ రమ్యకృష్ణ, మధుబాలతో కలిసి అదిరిపోయే స్థాయిలో స్టెప్పులు వేశారు. రాఘవేంద్రరావు హీరో రాజశేఖర్ లోని లవర్ బాయ్ కోణాన్ని ఆవిష్కరించారు.

మెగాస్టార్ చిరంజీవి సైతం రాజశేఖర్ ఇంత బాగా స్టెప్పులు వేయగలరా..? అని ఆశ్చర్యపోయారు. అల్లరి ప్రియుడు చూసిన వెంటనే రాజశేఖర్ కు చిరంజీవి ఫోన్ చేసి మరీ అభినందించడం గమనార్హం. అల్లరి ప్రియుడు 100 రోజుల ఫంక్షన్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై షీల్డ్ లను కూడా అందజేశారు. రాజశేఖర్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలలో అల్లరి ప్రియుడు మూవీ కూడా ఒకటని చెప్పవచ్చు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus