ఆ దర్శకునికి చిరంజీవి ఛాన్స్ ఇస్తున్నారా?

మెగాస్టార్ చిరంజీవికి ఆచార్య సినిమాతో చేదు ఫలితం ఎదురైంది. అయితే సినిమా రంగంలో జయాపజయాలు సాధారణం అని తర్వాత సినిమాలతో చిరంజీవి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.

చిరంజీవి తాజాగా మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో వందేమాతరం అనే కథకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదలై సక్సెస్ సాధించాల్సి ఉంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే మాత్రమే చిరంజీవి కృష్ణవంశీ కాంబో మూవీకి సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఈ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించేలా చిరంజీవి జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. చిరంజీవి ఒక్కో సినిమాకు 30 నుంచి 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

తర్వాత సినిమాలు విజయాలను అందుకుంటే చిరంజీవి రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. రీఎంట్రీలో చిరంజీవి రీమేక్ సినిమాలలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆచార్య సినిమా ఫలితం చిరంజీవిని కొంతమేర బాధపెట్టిందని సమాచారం అందుతోంది. ఈ సినిమా ఫలితాన్ని మరిచిపోయి తర్వాత సినిమాలపై దృష్టి పెట్టాలని చిరంజీవి భావిస్తున్నారు. యంగ్ డైరెక్టర్లకు, టాలెంటెడ్ డైరెక్టర్లకు చిరంజీవి ఎక్కువగా అవకాశాలను ఇస్తుండటం గమనార్హం. తర్వాత సినిమాలతో చిరంజీవికి ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus