Chiranjeevi: వాల్తేరు వీరయ్యలో ఆ యాసలో మాట్లాడతానన్న చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా భోళా శంకర్ సినిమా 2023 సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా గురించి తాజాగా చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రీఎంట్రీలో ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటిస్తున్న చిరంజీవి రీమేక్ సినిమాలలో నటించడానికి గల కారణాలను సైతం వెల్లడించారు.

కథల కొరత వల్ల రీమేక్ సినిమాలు చేయడం లేదని చిరంజీవి అన్నారు. ప్రేక్షకులకు మాపై భారీ అంచనాలు ఉన్నాయని చిరంజీవి కామెంట్లు చేశారు. రమణ రీమేక్ ఠాగూర్ కు డైరెక్టర్ గా మొదట మురుగదాస్ పేరును పరిశీలించామని చిరంజీవి చెప్పుకొచ్చారు. తమిళంలో తీసినట్టు ఠాగూర్ ను తెలుగులో తీస్తే సినిమా ఫ్లాపవుతుందని చెప్పానని భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న సమయంలో అదే స్థాయిలో కలెక్షన్లు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని చిరంజీవి వెల్లడించారు.

ఇలాంటి పరిస్థితుల్లో సేఫ్ అనిపించిన సినిమాలను రీమేక్ చేయడం కరెక్ట్ అని చిరంజీవి అన్నారు. 2023 సంవత్సరం మార్చి నుంచి నా కొత్త సినిమాలు మొదలవుతాయని చిరంజీవి వెల్లడించారు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నా పాత్ర ఫుల్ మాస్ లుక్ లో ఉంటుందని చిరంజీవి కామెంట్లు చేశారు. ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ తూర్పుగోదావరి యాసలో ఉంటాయని చిరంజీవి తెలిపారు.

తాను కూడా గోదావరి యాసలోనే మాట్లాడతానని చిరంజీవి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను నేనే ఫిక్స్ చేశానని చిరంజీవి వెల్లడించారు. చిరంజీవి సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. చిరంజీవి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మెగాస్టార్ తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus