Chiranjeevi: వైరల్ అవుతున్న చిరంజీవి షాకింగ్ కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గాడ్ ఫాదర్ సినిమాతో మెగాస్టార్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. అయితే కమర్షియల్ గా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. మరోవైపు ఈ మధ్య కాలంలో చిరంజీవి పేరు కొన్ని వివాదాలలో వినిపిస్తోంది. చిరంజీవి తప్పు లేకపోయినా కొంతమంది కావాలని ఆయనను టార్గెట్ చేస్తున్నారు.

అయితే తన జీవితంలో ఎదురైన వివాదాల గురించి ఆ పరిస్థితులను తాను ఎదుర్కొన్న తీరు గురించి చిరంజీవి తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తప్పు చేయకపోయినా ఆరోపణలు వస్తే ఢీ కొట్టాల్సిన అవసరం లేదని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పు చెయ్యము అని చేసింది తప్పు అని తెలిసినా వెంటనే సరిదిద్దుకుంటామని చిరంజీవి వెల్లడించడం గమనార్హం. ఫ్యాన్స్ తప్పు చేసినా తాను ఇంటికి వెళ్లి మాట్లాడతానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

తప్పు చేయకపోయినా ఆరోపణలు వస్తే నిజం నిలకడ మీద తెలుస్తుందని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు. జీవిత రాజశేఖర్ లపై నా ఫ్యాన్స్ రాళ్లు విసిరితే నేను వాళ్ల ఇంటికి వెళ్లానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఒక అడుగు వెనక్కు తగ్గితే తప్పు కాదని సంయమనం పాటించాలని చిరంజీవి అన్నారు. నా బ్లడ్ బ్యాంక్ గురించి కూడా ఎన్నో ఆరోపణలు చేశారని చిరంజీవి వెల్లడించారు. తప్పు చేయకపోతే ఉలిక్కిపడాల్సిన అవసరం ఏముందని చిరంజీవి అన్నారు.

చిరంజీవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి వెంకీ కుడుముల కాంబో మూవీ ఆగిపోయినట్టేనని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సినిమసినిమాకు మెగాస్టార్ రెమ్యునరేషన్ సైతం పెరుగుతోందని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ సినిమాకు చిరంజీవి కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus