చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది దీంతో చిరంజీవి ఖాతాలో పెద్ద డిజాస్టర్ సినిమా చేరిందని చెప్పాలి. ఈ సినిమా తర్వాత చిరంజీవి తన తదుపరిచిత్రాన్ని తన కుమార్తె నిర్మాణంలో కళ్యాణకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ ఈ సినిమా గురించి ఇంకా స్పష్టత తెలియాల్సి ఉంది.
ఇక చిరంజీవి తన తదుపరి సినిమాని బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చేయబోతున్నట్లు తన పుట్టినరోజు సందర్భంగా అధికారకంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా నవంబర్ నెల నుంచి షూటింగ్ పనులు జరుపుకుంటుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో చిరంజీవి ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇంకా మూడు నాలుగు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాలి అనే ఆలోచనలో చిరంజీవి లేరని సమాచారం.
తాజాగా చిరంజీవి (Chiranjeevi) మోకాలికి సర్జరీ చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో ఈయన బయటకు కూడా ఎక్కడ రావడం లేదు ఇంట్లో కూడా చేతి కర్ర సహాయంతోనే నడుస్తున్నారట ఇలాంటి తరుణంలోనే ఇప్పుడే తాను సినిమా షూటింగ్కు హాజరు కాలేనని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట చిరంజీవి బయటకు రానటువంటి క్రమంలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా రామ్ చరణ్ హాజరవుతున్నారు.
ఇలా ఇండస్ట్రీలో జరిగే కార్యక్రమాలకు ఫంక్షన్లకు చరణ్ ను పంపిస్తూ టాలీవుడ్ కి తన కుమారుడిని మరింత దగ్గర చేయాలన్న ఆలోచనలో చిరంజీవి ఉన్నారని అందుకే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క ఈవెంట్ కు చరణ్ సతి సమేతంగా హాజరవుతున్నారని చెప్పాలి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలతో పాటు బ్రహ్మానందం కుమారుడి వివాహం అలాగే ఇతర కార్యక్రమాలకు కూడా రామ్ చరణ్ మాత్రమే హాజరవుతున్నారు. తన తర్వాత తన కుమారుడు కూడా ఇండస్ట్రీకి పెద్దగా ఉండాలన్న ఉద్దేశంతోనే చిరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!