Chiranjeevi: రంగమార్తాండ విషయంలో అలా జరుగుతోందా?

ఈ మధ్య కాలంలో కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన రంగమార్తాండ సినిమా వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ సైతం మొదలయ్యాయి. ఈ సినిమాకు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారని ఇప్పటికే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ సినిమాలో చిరంజీవి కనిపించే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

మరాఠీ మూవీ నటసామ్రాట్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం రంగ మార్తాండ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవి వాయిస్ ఓవర్ కు సంబంధించిన సీన్ల షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తోంది. తాజాగా చిత్రయూనిట్ మన అమ్మ నాన్నల కథ అని చెబుతూ రిలీజ్ చేసిన వీడియోలో ఈ సినిమాలో నటించిన యాక్టర్లు, టెక్నీషియన్లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

ఈ వీడియో చివర్లో మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా ఉండటంతో చిరంజీవి ఈ సినిమాలో నటిస్తున్నారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి లేదా కృష్ణవంశీ ఈ ప్రశ్నకు సంబంధించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. చిరంజీవి ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కృష్ణవంశీ 21వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. కృష్ణవంశీ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కృష్ణవంశీ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. కృష్ణవంశీ గత కొన్నేళ్లలో డైరెక్షన్ చేసిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. అయితే కృష్ణవంశీని అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం అస్సలు తగ్గలేదు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus