చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఈ సినిమా కోసం చిరంజీవి ఇప్పటికే ఎంతో కష్టపడి లుక్ మార్చుకున్నారు. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమా కోసం మార్కెట్ ను మించి ఖర్చు చేస్తున్నారని సమాచారం.
అయితే చిరంజీవి వశిష్ట కాంబో మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని సమాచారం. 2025 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. 2024 సంవత్సరంలో మాత్రం చిరంజీవి సినిమా రిలీజ్ లేనట్టేనని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చిరంజీవి ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్లుగా అనుష్క, మృణాల్ ఠాకూర్ మరి కొందరి పేర్లు వినిపిస్తుండగా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. బింబిసార తర్వాత మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. చిరంజీవి ఈ సినిమా కోసం 60 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడానికి ఈ సినిమా పర్ఫెక్ట్ మూవీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చిరంజీవి (Chiranjeevi) నటించిన భోళా శంకర్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోగా తర్వాత సినిమాలకు సంబంధించి ఎలాంటి తప్పులు జరగకుండా మెగాస్టార్ జాగ్రత్త పడాల్సి ఉంది. నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం అభిమానులకు సైతం సంతోషాన్ని కలిగిస్తోంది. వరుసగా భారీ ప్రాజెక్ట్ లతో చిరంజీవి కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!