Bhola Shankar: ఆ రేంజ్ లో కలెక్షన్ల్ సాధించడం భోళా శంకర్ మూవీకి సులువేనా?

చిరంజీవి తమన్నా కాంబినేషన్ లో మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన భోళా శంకర్ మూవీ మరో 9 రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా చిరంజీవి, మెహర్ రమేష్ లకు భారీ సక్సెస్ ను అందిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమా టార్గెట్ 90 కోట్ల రూపాయలు అని సమాచారం. 91 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.

భోళా శంకర్ మూవీ ఏరియాల వారీ హక్కులను పరిశీలిస్తే నైజాం హక్కులు 25 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడవగా ఏపీ, సీడెడ్ హక్కులు 50 కోట్ల రూపాయల హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం. ఈ సినిమా ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల హక్కులు 15 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. భోళా శంకర్ సినిమాపై తమన్నా, కీర్తి సురేష్ చాలా ఆశలు పెట్టుకున్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

భోళా శంకర్ సక్సెస్ సాధిస్తే మహతి స్వరసాగర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో చేరే అవకాశం ఉంటుంది. చిరంజీవి ఈ సినిమాతో మరో మాస్ సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర భారీ స్థాయిలో ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. అనిల్ సుంకరకు ఈ సినిమా మరో సక్సెస్ ను అందించడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

భోళా శంకర్ (Bhola Shankar) మూవీ ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉన్నాయని ఆ ట్విస్టులు సైతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది. చిరంజీవిని అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus