‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ కు టైటిల్ ఫిక్స్ ..!

అవును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాను నటిస్తున్న కొత్త సినిమా కోసం తన అన్నయ్య చిరంజీవి నటించిన ఓ సినిమా టైటిల్ ను వాడేసుకుంటున్నాడట. వివరాల్లోకి వెళితే.. గతంలో చిరంజీవి- మోహన్ బాబు లు హీరోలుగా ‘బిల్లా రంగా’ అనే మల్టీ స్టారర్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. 1982లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షలను బాగా అలరించింది. ఆ క్లాసిక్ ను రీమేక్ చెయ్యాలని మెగా మేనల్లుడు సాయి తేజ్, మంచు మనోజ్ లు ఎప్పటినుండో అనుకుంటున్నారు.

మరి పవన్ కళ్యాణ్ కు ఈ చిత్రం టైటిల్ తో పనేంటి అనే అనుమానం మీకు వచ్చి ఉండచ్చు. మ్యాటర్ ఏంటంటే… మలయాళంలో సూపర్ హిట్టయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో పవన్ కళ్యాణ్, రానా లు కలిసి నటించనున్నారు. ఈ మధ్యనే అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు నిర్మాతలు. ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.

‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చెయ్యబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ రీమేక్ కు ‘బిల్లా రంగా’ అనే టైటిల్ ను దర్శకనిర్మాతలు ఖరారు చేసినట్టు తాజా సమాచారం. అయితే ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది. ఒక్కసారి షూటింగ్ మొదలుపెడితే రెండే రెండు నెలల్లో సినిమాని కంప్లీట్ చేసేలా బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus