Chiranjeevi: వైరల్ అవుతున్న చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. చరణ్ నటనను హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ మెచ్చుకోగా ఈ విషయం తెలిసిన చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జేమ్స్ కేమరూన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతమైన మూవీ అని అన్నారు.

తొలిసారి ఈ సినిమాను చూసిన సమయంలో సంభ్రమాశ్చర్యానికి గురయ్యానని ఈ సినిమా గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదని కేమరూన్ అన్నారు. సినిమాలో కథ చెప్పిన విధానం, రోల్స్, విజువల్ ఎఫెక్స్ట్ ను చూసిన తర్వాత షేక్ స్పియర్ క్లాసిక్ గుర్తుకొచ్చిందని కేమరూన్ కామెంట్లు చేశారు. సినిమాలో రామ్ రోల్ ఛాలెంజింగ్ అని ఆ పాత్ర మనస్సులో ఏముందో తెలిశాక నా గుండె బద్దలైందని ఆయన కామెంట్లు చేశారు.

డైరెక్టర్ రాజమౌళిని కలిసిన సమయంలో ఈ విషయం గురించే చెప్పానని కేమరూన్ అన్నారు. ఈ కామెంట్ల గురించి చిరంజీవి స్పందిస్తూ జేమ్స్ కేమరూన్ సార్ చరణ్ పాత్రను ప్రస్తావిస్తూ కామెంట్లు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. జేమ్స్ కేమరూన్ అభిప్రాయం ముందు ఆస్కార్ కూడా చిన్నదేనని చిరంజీవి చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదిగాడా అని తండ్రిగా గర్వపడుతున్నానని చిరంజీవి వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ వస్తే మాత్రం ఈ సినిమా రేంజ్ అంచనాలకు అందని స్థాయిలో పెరగడం గ్యారంటీ అనే కామెంట్లు సైతం వినిపిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు సినిమాల ఖ్యాతిని ఊహించని రేంజ్ లో పెంచడంతో పాటు చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి స్థాయిని సైతం పెంచిందనే సంగతి తెలిసిందే.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus