టెన్షన్ పడుతున్న మెగాస్టార్!!!

టాలీవుడ్ లో దాదాపుగా 30ఏళ్ల కరియర్ ను ముగించుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ సరిగ్గా కలసి రాక…మళ్లీ ఇండస్ట్రీ బాట పట్టాడు మన మెగాస్టార్. అయితే అదే క్రమంలో దాదాపుగా రెండు ఏళ్ల నుంచి ఊరిస్తూ వస్తున్న మెగాస్టార్ 150వ చిత్రం ఖైదీ నెమ్ 150 చిత్రం ఎట్టకేలకు వచ్చే సంక్రాంతి బరిలో దిగనుంది. అదే క్రమంలో ఈ సినిమాకు ధీటుగా నందమూరి నట సింహం బాలయ్య ప్రతిష్టాత్మక 100వ చిత్రం, అమరావతిని ఏలినా శాతవాహనుల కధను కమర్షియల్ గా తెరకెక్కిస్తూ సంక్రాంతి రేస్ లో దూసుకొస్తుంది. అయితే బాలయ్య, చిరు ఇద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద తలబడటం కొత్త ఏమీ కాదు..కానీ…ఈ సంక్రాంతి రేస్ చూస్తుంటే మాత్రం బాలయ్య దూకుడుకి మెగాస్టార్ కాస్త భయపడుతున్నట్లే ఉంది.

దానికి తగ్గట్టు కొన్ని సెంటిమెంట్స్ కూడా మెగాస్టార్ ను భయపెడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది…దాదాపుగా 15ఏళ్ల ముందు నరసింహనాయుడి రూపంలో బాలయ్య చిరు పై పై చేయి సాధించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు..అదే క్రమంలో సంక్రాంతి రేస్ లో ఎక్కువ సార్లు బాలయ్య చిరు పై గెలుపు బాహుటా ఎగరవేయ్యడంతో ఈ సంక్రాంతి రేస్ చిరుకి మరింత ఇబ్బందిగా మారినట్లు కనిపిస్తుంది…అంతేకాకుండా…జనవరి 11కు మారిన బాలయ్య సినిమా అప్పట్లో నరసింహనాయుడి సెంటిమెంట్ ను రిపీట్ చేసేలా ఉండడంతో….మెగా శిబిరంలో కాస్త అలజడి రేపుతుంది…..మరి ఈ సంక్రాంతికి మెగా నందమూరి సినిమాల్లో ఏది ఎలా ఉండబోతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus