ఇంకా వచ్చే ఏడాది సంక్రాంతి సినిమా బరి సంగతే తేలలేదు.. అప్పుడే సమ్మర్ పోరు గురించి ఆలోచిస్తున్నారా? ఇది టూమచ్ కదా అని అంటారేమో. కానీ వచ్చే వేసవి సీజన్‌కి రానున్న సినిమాల్లో ఓ రెండు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. అందులో ఓ సినిమాకు స్టార్ దర్శకుడు, మోస్ట్ అవైటెడ్ కాంబో ఉండటం, రెండోది విజువల్స్ పరంగా భారీగా తెరకెక్కుతుండటమే కారణం. ఆ సినిమాలే చిరంజీవి – మల్లిడి వశిష్ట ‘విశ్వంభర’ కాగా.. రెండోది వెంకటేశ్ – త్రివిక్రమ్ సినిమా.
‘విశ్వంభర’ సినిమాను వచ్చే సమ్మర్‌లో రిలీజ్ చేస్తాం అని మొన్నీమధ్య చిరంజీవి ప్రకటించారు. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనులు పెండింగ్ ఉన్నాయని, వాటికి చాలా సమయం పడుతుందని, సమ్మర్‌లో సినిమాను మీ ముందుకు తీసుకొస్తామని టీమ్ తరఫున చిరంజీవి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి మరీ చెప్పారు. ఇక వెంకటేశ్ – త్రివిక్రమ్ సినిమా నిర్మాత నాగవంశీ అయితే వచ్చే వేసవికి వచ్చేలా ప్లాన్స్ చేస్తున్నామని తెలిపారు. ఇదే జరిగితే ఈ సమ్మర్ చిరు వర్సెస్ వెంకీ అవుతుంది.
అయితే, ఇద్దరూ ముఖాముఖి తలపడే పరిస్థితి ఉండదు అని చెప్పొచ్చు. ఎందుకంటే సమ్మర్ చాలా పెద్ద సీజన్. ఏప్రిల్, మే అంటూ రెండు నెలలు సమ్మర్ సీజనే. ఇందులో రెండు సినిమాలు రెండు వేర్వేరు వీకెండ్‌లను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఎవరు ముందొస్తారు, ఎవరు తర్వాత వస్తారు అనేది ఇక్కడ పాయింట్. ఎందుకంటే వెంకీ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. త్రివిక్రమ్ త్వరగానే ముగించేస్తారు. సమ్మర్‌కి ఇంకా కనీసం ఆరు నెలలు ఉంది. కాబట్టి తొలుత వెంకీ సినిమానే రావొచ్చు.
చిరంజీవి ‘విశ్వంభర’ అయితే మే9న తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ డేట్ సెంటిమెంట్ కూడా దీనికి ఓ కారణం. చూడాలి మరి త్రివిక్రమ్ ఎంత త్వరగా పూర్తి చేస్తారో. ఒకవేళ ఆ సినిమా లేట్ అయితే రెండూ మే నెలలో వచ్చే అవకాశం ఉంది.
2 mins ago