‘చిరు 152’ టైటిల్ లీక్ వెనుక అంత కథ ఉందా..?

  • March 3, 2020 / 04:38 PM IST

‘ఆచార్య’ అనే టైటిల్ ను ఇప్పటికే ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘కొణిదెల ప్రొడక్షన్స్’ వారు ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో దర్శకుడు కొరటాల శివ , మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం పేరు అదే అని అంతా ఫిక్సయిపోయారు. అనుకోకుండా ఇటీవల జరిగిన ‘ఓ పిట్ట కథ’ ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ సైతం.. ‘తాను కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం పేరు ‘ఆచార్య’ అంటూ లీక్ చేసేసారు’ అంటూ ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే మెగాస్టార్ అలా లీక్ చేయడం వెనుక వేరే కథ ఉందని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

అసలు మ్యాటర్ ఏంటంటే.. ‘ఆచార్య’ అనే టైటిల్ ను రిజిస్టర్ అయితే చేయించారు కానీ.. అది దర్శకుడు కొరటాల శివకు అంత సంతృప్తి నివ్వలేదని తెలుస్తుంది. ఈ విషయం పై మెగాస్టార్ చిరంజీవి, మరియు చరణ్ లతో డిస్కషన్లు కూడా పెట్టారట. దీనికి చిరు టైటిల్ బాగానే ఉంది అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారట. అయినప్పటికీ కొరటాల డౌట్ తో ఉండడంతో.. ఓసారి ‘ఆచార్య’ అనే టైటిల్ జనాల్లోకి వెళితే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దామని మెగాస్టార్ ఇలా లీక్ చేసినట్టు తెలుస్తుంది. అలా లీక్ చేసినా ఆ టైటిల్ కు అంత రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. మెగా ఫ్యాన్స్ కూడా ‘ఆచార్య’ అనే టైటిల్ అంత ఆకర్షించే విధంగా లేదని చెప్పినట్టు కూడా చిత్ర యూనిట్ సభ్యులు తెలుసుకున్నారట. దీంతో కచ్చితంగా టైటిల్ మార్చాలనే ఉద్దేశానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus