తండ్రి మెగాస్టార్.. బాబాయ్ పవర్ స్టార్.. ఇద్దరి ప్రోత్సాహంతో మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ సినీ రంగంలోకి అడుగు పెట్టారు. మెగా పేరు కి మచ్చ తీసుకురాకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు చరణ్. పదేళ్లలో కేవలం పది సినిమాలు మాత్రమే చేయగలిగారు అంటే కథ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో అర్ధమవుతోంది. నేడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా అతని సినీ ప్రయాణంపై ఫోకస్..
చిరుత (2007 )డేరింగ్, డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చరణ్ వెండితెరకి పరిచయం అయ్యారు. తొలి సినిమాలోనే అదిరిపోయే స్టెప్పులతో.. అబ్బురపరిచే ఫైట్స్ తో ఆకట్టుకున్నారు.
మగధీర (2009)మొదటి చిత్రం ‘చిరుత’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశాన్ని చరణ్ దక్కించుకున్నారు. పైగా డ్యూయల్ రోల్. కాల భైరవ / హర్ష పాత్రలను అద్భుతంగా పోషించి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. రెండో సినిమాకే అనేక రికార్డులను కొల్లగొట్టారు.
ఆరంజ్ (2010 )“మగధీర” చిత్రంతో చరణ్ స్థాయి అమాంతం పెరిగింది. అంచనాలు కూడా పెరిగి పోయాయి. ఆ అంచనాలను ‘ఆరంజ్’ అందుకోలేక పోయింది. అయినా ఆరంజ్ లో రామ్ చరణ్ ప్రేమికుడిగా వంద మార్కులు అందుకున్నారు.
రచ్చ (2012)మెగా సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై ఆర్. బి. చౌదరి నిర్మించిన రచ్చ యువతకి భలే నచ్చింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఫుల్ జోష్ తో నటించి అభినందనలు అందుకున్నారు.
నాయక్ (2013 )మాస్ అభిమానులకు నాయక్ సినిమా ద్వారా చరణ్ విందు భోజనం వడ్డించారు. “చెర్రీ”, సిద్ధార్థ్ నాయక్ పాత్రలు చూసేందుకు ఒకే విధంగా ఉన్నప్పటికీ నటన మాత్రం విభిన్నంగా ఉంటుంది.
ఎవడు (2014 )చరణ్ కి మినిమం గ్యారెంటీ హీరో అని పేరు తెచ్చిపెట్టిన మూవీ ఎవడు. ఇందులో ఒకే పాత్రలో రెండు షేడ్స్ ని చరణ్ చక్కగా పలికించి హిట్ కొట్టారు.
గోవిందుడు అందరివాడేలే (2014 )పూర్తి స్థాయి కుటుంబ కథ చిత్రాన్ని చేయాలనీ కోరుకున్న అభిమానుల కోసం చరణ్ గోవిందుడు అందరివాడేలే చేశారు. ఈ మూవీఆర్ధికంగా విజయం సాదించలేకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు అందుకుంది.
బ్రూస్ లీ ( 2015 )రొటీన్ కథలకు కొంచెం ఫన్ దట్టించి.. మంచి ట్విస్ట్ లతో ఉన్న బ్రూస్ లీ ని చెర్రీ చేశారు. ఈ సినిమా ఇచ్చిన ఫలితంతో మంచి గుణపాఠం నేర్చుకున్నారు.
ధృవ (2016 )మంచి హిట్ కోసం చూస్తున్న చరణ్ టోటల్ గా బాడీని మార్చేశారు. తమిళంలో హిట్ సాధించిన తని ఒరువన్ సినిమాకి తన స్టైల్, ఎనర్జీ ని జోడించి ధృవ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.
రంగస్థలం (2018)ప్రయోగాలు మిశ్రమ ఫలితాన్ని అందించినా.. భయపడకుండా ఈసారి కూడా ప్రయోగం చేశారు. స్టార్ హీరో అయి ఉండి చెవిటివాడిగా నటించడానికి సై అన్నారు. పాతికేళ్ల కథలో డీ గ్లామర్ గా కనిపించడానికి ఓకే చెప్పారు. మార్చి 30 న రిలీజ్ కానున్న రంగస్థలం సినిమాతో మాస్ ప్రజల గుండెల్లో నిలిచిపోనున్నారు.