ఆశ్చర్యపరుస్తున్న స్టార్‌ కొరియోగ్రాఫర్‌ కొత్త అవతారం

గణేష్‌ ఆచార్య అనంగానే… ఓ భారీకాయం గుర్తొస్తుంది. ‘అంత భారీ శరీరంతో డ్యాన్స్‌ ఎలా చేస్తున్నాడు రా బాబూ’ అని కూడా అనిపిస్తుంది. కానీ గణేష్‌ డ్యాన్స్‌ వేసేవాడు… వేయించేవాడు కూడా. అయితే ఇటీవల ఓ సినిమా కోసం పని చేస్తున్నప్పుడు తన బరువు తన డ్యాన్స్‌ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోందో అర్థం చేసుకున్నాడు. వెంటనే బరువు తగ్గే పని మొదలుపెట్టాడు. అందరినీ ఆశ్చర్యంలో నెట్టేస్తూ 98 కిలోల బరువు తగ్గిపోయాడు. ఎంతగా అంటే తన షర్ట్ సైజ్‌ 7 XL నుండి Lకు వచ్చేంత. మరి ఆ ఇన్స్‌పిరేషన్‌ వెయిట్‌ లాస్‌ ఎలా చేశాడో చూద్దాం.

‘హౌస్‌ఫుల్‌ 3’ షూటింగ్‌ టైమ్‌లో గణేష్‌ ఆచార్య తన బరువుతో ఇబ్బంది పడ్డారట. డ్యాన్స్‌ చేసేటప్పుడు మోకాళ్ల మీద భారం ఎక్కువగా పడుతుందని గుర్తించాడు… ఇది 2016లో జరిగింది. అప్పుడు అతని బరువు 200 కిలోలు అంట. ఇక బరువు తగ్గాల్సిన టైమ్‌ వచ్చింది అనుకున్నారు. అయితే చాలామందిలా ఉదయాన్నే నిద్రలేవగానే ఆ విషయం మరచిపోలేదు. కట్‌ చేస్తే ఇప్పుడు అంటే 2020 ఆఖరికి వచ్చేసరికి బరువు 102 కిలోలు. అంటే రెండున్నరేళ్లలో 98 కిలోల బరువు తగ్గారు.

బరువు తగ్గడంలో గణేష్‌ ఆచార్య చాలా కష్టాలు పడ్డాడు. అయితే ఇష్టంగా చేసుకుంటూ బరువు తగ్గాడు. అని ట్రైనర్‌ అజయ్‌ నాయుడు చెప్పింది చెప్పినట్లుగా చేసి సన్నబడ్డాడు… బరువూ తగ్గాడు. క్రంచెస్‌ నుంచి మొదలుపెట్టి సిజర్స్‌, లేటరల్‌ రైజెస్‌ లాంటి మొత్తం 11 రకాల ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ వచ్చాడు. రోజుకు 75 నిమిషాలు కసరత్తులు చేసేవాడట. అలా మొత్తంగా తన బరువు తగ్గించుకున్నాడు… ఇప్పుడు ఫిట్ అయ్యి అందరి ముందుకొచ్చాడు. బరువు తగ్గాక తన డ్యాన్స్‌లో తేడా స్పష్టం కనిపిస్తోందని చెప్పాడు గణేష్‌ ఆచార్య.


Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus