రత్నవేలు తల్లి మృతి..!

ప్రముఖ స్టార్ సినిమాటోగ్రఫర్ రత్నవేలు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో..! అతని ఇంట్లో ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి జ్ఞానేశ్వరి రామన్ గారు ఈరోజు మరణించారు. గత కొద్ది రోజులుగా ఈమె అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్నారట. ఇక ఈరోజున అంటే మార్చి 21న ఆమె తుది శ్వాస విడిచినట్టు తెలుస్తుంది. రత్నవేలు చెన్నై కు చెందిన వ్యక్తి. తమిళంలో వరుసగా సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. తెలుగులో ఇతన్ని మన స్టార్ డైరెక్టర్ సుకుమార్ పరిచయం చేసాడు. ‘ఆర్య’ చిత్రంతో రత్నవేలు తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు.

అటు తరువాత ‘జగడం’ చిత్రం కూడా చేసాడు. అయితే ‘1 నేనొక్కడినే’ చిత్రంతో ఇతని క్రేజ్ అమాంతం పెరిగింది. అది డిజాస్టర్ సినిమానే అయినప్పటికీ.. ఆ చిత్రంలో ఈయన సినిమాటోగ్రఫీ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంటుంది అనేది అక్షర సత్యం. ఇక అటు తరువాత రత్నవేలు తెలుగులో బిజీ టెక్నిషియన్ గానే కాకుండా స్టార్ టెక్నిషియన్ కూడా ఎదిగాడు. ‘రంగస్థలం’ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలలో కూడా ఇతని పనితనం వర్ణనాతీతం. ఇక రత్నవేలు తన తల్లి గురించి చెబుతూ.. ” నా ట్యాలెంట్ ను గుర్తించిన వ్యక్తి మా అమ్మ… నా డ్రీం ను అర్థం చేసుకున్న వ్యక్తి మా అమ్మ ఈరోజు నాకు దూరమైపోయారు. నా బలం.. నా స్ఫూర్తి.. నా దైవం.. అయిన అమ్మా.. ఐ మిస్ యూ. ఎప్పటికీ నీకు కృతజ్ఞుడనై ఉంటాను” అంటూ పేర్కొన్నాడు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus