ఎన్టీఆర్ క్యారెక్టర్ బాలయ్య చేయగలడా అని భయమేసింది : చంద్రబాబు నాయుడు

 

దివంగత నేత, మహానటుడు అయిన నందమూరి తారకరామారావు జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ నుండీ మొదటి భాగమైన ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ చిత్రం తాజాగా విడులయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు నందమూరి బాలకృష్ణ. భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందింది. ఇక ‘ఎన్టీఆర్’ పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించి మెప్పించగా.. ఎన్టీఆర్ సతీమణి అయిన బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక ‘ఏఎన్ఆర్’ పాత్రలో హీరో సుమంత్, నందమూరి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటించారు.

ఇక తాజాగా చంద్రబాబు నాయుడు గారి గురించి స్పెషల్ షో వేశారు. ఇక చంద్రబాబు నాయుడుగారితో కలిసి.. ఈ చిత్ర దర్శకుడు క్రిష్, బాలకృష్ణ, మంత్రి దేవినేని ఉమ, పలువురు టీడీపీ నేతలు కూడా కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. ఇక చిత్రం చుసిన తర్వాత మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఇక అయన మాట్లాడుతూ… ”ఈ చిత్రం చాలా బాగుంది. ఈ సినిమాలో బాలకృష్ణ చాలా బాగా నటించారు.ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య పరకాయ ప్రవేశం చేసేసారు. చాలా అద్భుతంగా నటించారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య అసలు చేయగలడా అనే అనుమానం నాకుండేది . కానీ ఈ చిత్రం చూసిన తర్వాత ఎన్టీఆర్ పాత్రకు బాలయ్య మాత్రమే న్యాయం చేయగలడు అన్పించింది. ఎన్టీఆర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగుజాతి గర్వించదగ్గ బిడ్ద ఎన్టీఆర్” అంటూ చంద్రబాబు నాయుడు ఈ చిత్రం పై ప్రశంసల జల్లు కురిపించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus